అన్నీ రాజమౌళే చేయడం ఇబ్బందిగా ఉంది : నాని
సినిమా షూటింగులో అన్నీ రాజమౌళిగారే చేస్తారు. డైరెక్షన్, యాక్టింగ్, ఫైట్లు చివరకు క్రేన్ తోయడం కూడా. ఇలా అన్నీ ఆయనే చేస్తుంటే రెమ్యూనరేషన్ తీసుకోవడం మాకు ఇబ్బందిగా ఉంది సార్... అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు హీరో నాని. ఈగ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న నాని మాట్లాడుతూ...రాజమౌళి గొప్ప డైరెక్టరే కాదు, ఫెంటాస్టిక్ యాక్టర్ కూడా. మేం సినిమాలో చేసేవన్నీ ఆయన ముందే మాకు చేసి చూపిస్తారు. ఆయన చేసినదాంట్లో సంగం చేస్తే చాలు మేం బాగా నటించినట్లే అన్నారు. ఒక రకంగా సినిమాకు రాజమౌళి వన్‌మెన్ ఆర్మీ లాంటోడని కొనియాడారు.
తొలుత 'ఈగ' సినిమా కథ విన్నప్పుడు తన పాత్ర కొంత సేపే ఉంటుందని బాధ పడ్డాను. కానీ ఆయనతో కలిసి పని చేసిన తర్వాత....ఆ అవకాశం దొరకడం కూడా ఎంతో గొప్పగా భావిస్తున్నాను అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఈగ' చిత్రాన్ని వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. నాని హీరోగా నటిస్తుండగా, సమంత హీరోయిన్ పాత్రలో, కన్నడ నటుడు సుదీప్ విలన్ పాత్రలో దర్శనం ఇవ్వబోతున్నాడు. కథ ప్రకారం హీరో నాని విలన్ సుదీప్ చేతిలో చంపబడతాడు. విలన్ పై పగతీర్చుకోవడానికి ఈగ రూపంలో వచ్చిన హీరో అతన్ని ముప్పతిప్పలు పెడుతుంటాడు. ఒకరంగా సినిమాలో హీరో లేడనే చెప్పాలి. సినిమా మొత్తం ఈగనే నడిపిస్తుంది. ఇందుకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.


Click it and Unblock the Notifications











