'అందాల రాక్షసి'కలెక్షన్స్ గురించి రాజమౌళి
ఇంతకు రెండు రోజులు ముందు ఈ చిత్రం గురించి ట్వీట్ చేస్తూ...అంతటా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా,నెగిటివ్ సమీక్షలు వచ్చినా, అందాల రాక్షసి చిత్రం అధ్బుతమైన ఓపినింగ్స్ ని తెచ్చుకుంది. శనివారం,ఆదివారం కూడా అదే విధంగా కలెక్షన్స్ వచ్చాయి. సోమవారం డిసైడ్ అవుతుంది అని ట్వీట్ చేసారు. ఇప్పుడు దానికి రిప్లై గా సంతోషంగా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయంటూ ట్వీట్ చేసారు. ఇక రాజమౌళి బ్రాండ్ నేమ్,ట్రైలర్స్ ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉండటానికి కారణం అంటున్నారు.
ఇక ఈ చిత్రం కథ ప్రకారం ...పుట్టుకతోటే ధనవంతుడు అయిన గౌతమ్ (రాహుల్)ఓ రోజు అనుకోకుండా ఓ అమ్మాయి మిథున (లావణ్య)ని చూసి ఆమే తన అందాల రాక్షసి అని ఫిక్సై ప్రేమలో పడిపోతాడు. అయితే ఆమె సూర్య (నవీన్)అనే మిడిల్ క్లాస్ కళాకారుడుతో తో ప్రేమలో మునిగితేలుతూంటుంది. కానీ సూర్య అప్పటికే ఓ యాక్సిడెంట్ లో ఆమెకు దూరమౌతాడు. ఆ జ్ఢాపకాల విషాదంలో ఉన్న ఆమెకు తన ప్రేమతో కొత్త జీవితాన్ని ఇచ్చి దగ్గరవటానికి ప్రయత్నిస్తాడు గౌతమ్. అంతా సవ్యంగా జరుగుతోంది ఆమె కూడా గతం మర్చిపోయి..గౌతమ్ ని యాక్సెప్టు చేస్తోంది అనుకునే సమయానికి సూర్య బ్రతికే ఉన్నాడనే విషయం తెలుస్తుంది. అప్పుడు గౌతమ్ ఏం నిర్ణయం తీసుకున్నాడు..మిధున పరిస్దితి ఏమిటనేది మిగతా కథ.


Click it and Unblock the Notifications












