twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అందాల రాక్షసి'కలెక్షన్స్ గురించి రాజమౌళి

    By Srikanya
    |

    హైదరాబాద్: రాజమౌళి తొలిసారి నిర్మాతగా మారి ప్రొడ్యూస్ చేసిన 'అందాల రాక్షసి'మొన్న శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదల రోజున నెటిటివ్ రివ్యూలతో బ్యాడ్ టాక్ వచ్చింది. దాంతో రాజమౌళి ఈ చిత్రం కలెక్షన్స్ సోమవారం నుంచి ఎలా ఉంటాయన్నదానిపై విజయం ఆధారపడి ఉంటుందన్న విదంగా మొన్న ట్వీట్ చేసారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ..సోమవారం రిజిస్టర్ అయిన కలెక్షన్స్ చూస్తూంటే ఎక్కడా డ్రాప్ కాలేదు. చూస్తూంటే 'అందాల రాక్షసి'మంచి విజయం సాధించేటట్లు ఉంది అని ట్వీట్టర్ లో రాసారు.

    ఇంతకు రెండు రోజులు ముందు ఈ చిత్రం గురించి ట్వీట్ చేస్తూ...అంతటా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా,నెగిటివ్ సమీక్షలు వచ్చినా, అందాల రాక్షసి చిత్రం అధ్బుతమైన ఓపినింగ్స్ ని తెచ్చుకుంది. శనివారం,ఆదివారం కూడా అదే విధంగా కలెక్షన్స్ వచ్చాయి. సోమవారం డిసైడ్ అవుతుంది అని ట్వీట్ చేసారు. ఇప్పుడు దానికి రిప్లై గా సంతోషంగా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయంటూ ట్వీట్ చేసారు. ఇక రాజమౌళి బ్రాండ్ నేమ్,ట్రైలర్స్ ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉండటానికి కారణం అంటున్నారు.

    ఇక ఈ చిత్రం కథ ప్రకారం ...పుట్టుకతోటే ధనవంతుడు అయిన గౌతమ్‌ (రాహుల్‌)ఓ రోజు అనుకోకుండా ఓ అమ్మాయి మిథున (లావణ్య)ని చూసి ఆమే తన అందాల రాక్షసి అని ఫిక్సై ప్రేమలో పడిపోతాడు. అయితే ఆమె సూర్య (నవీన్‌)అనే మిడిల్ క్లాస్ కళాకారుడుతో తో ప్రేమలో మునిగితేలుతూంటుంది. కానీ సూర్య అప్పటికే ఓ యాక్సిడెంట్ లో ఆమెకు దూరమౌతాడు. ఆ జ్ఢాపకాల విషాదంలో ఉన్న ఆమెకు తన ప్రేమతో కొత్త జీవితాన్ని ఇచ్చి దగ్గరవటానికి ప్రయత్నిస్తాడు గౌతమ్. అంతా సవ్యంగా జరుగుతోంది ఆమె కూడా గతం మర్చిపోయి..గౌతమ్ ని యాక్సెప్టు చేస్తోంది అనుకునే సమయానికి సూర్య బ్రతికే ఉన్నాడనే విషయం తెలుస్తుంది. అప్పుడు గౌతమ్ ఏం నిర్ణయం తీసుకున్నాడు..మిధున పరిస్దితి ఏమిటనేది మిగతా కథ.

    English summary
    Rajamouli is pleased with the box office collections of Andhala Rakshasi. He's one of the producers of the film and this is also the first time he has produced a film. After looking at the collections which the film registered on Monday, he revealed, "No significant drop in Monday mrng and noon shows..looks like andala rakshasi is holding fort..:) Weekend has been superb as expected." Hanu Raghavapudi directed the film and it stars newcomers Naveen, Rahul and Lavanya in lead roles. Radhan is the music director and Murali is the cinematographer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X