దుర్గా ఆర్ట్స్ లో జూ ఎన్టీఆర్ మరియు రాణా...!
దుర్గా ఆర్ట్ బ్యానర్ పై 2011 లో రెండు భారీ చిత్రాలు రూపొందనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో జూ ఎన్టీఆర్, దేవ కట్టా దర్శకత్వంలో రాణా దగ్గుబాటి హీరోగా రెండు సినిమాలు చేయడానికి దుర్గా ఆర్ట్స్ అధినేత కెయల్ నారాయణ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్స్ వచ్చే యేడాది సెకండాఫ్ లో ఆరంభమవుతాయాని తెలుస్తోంది. ప్రస్తుతం దేవా కట్టా ఈ ప్రాజెక్ట్ కోసం స్ర్కిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా త్వరలోనే కె యల్ నారాయణ ప్రకటిస్తాడని సమాచారం. రాజమౌళి ప్రస్తుతం ఈగ అనే ఒక ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారు ఆ తర్వాత ప్రభాస్ తో సినిమా ఉంటుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ తో సినిమా వుండే అవకాశం ఉంటుంది.
జూ ఎన్టీఆర్ రాణా రాజమౌళి దేవ కట్టా దుర్గా ఆర్ట్స్ శక్తి నేను నా రాక్షసి ఇలియానా jr ntr rana rajamouli deva katta durga arts shakti nenu naa rakshasi ileana


Click it and Unblock the Notifications