»   » జూ ఎన్టీఆర్‌పై రాజమౌళి సీరియస్, మందలింపు! (ఫోటో)

జూ ఎన్టీఆర్‌పై రాజమౌళి సీరియస్, మందలింపు! (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు రాజమౌళి-జూ ఎన్టీఆర్, వివి వినాయక్-జూ ఎన్టీఆర్ ఎంత క్లోజ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ అత్యంత సన్నిహితంగా మెలిగేది వీరిద్దరితోనే. తారక్ మేలు కోరే వారిలో ఈ ఇద్దరినీ ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తాజాగా రాజమౌళి తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో పోస్టు చేసిన ఫోటో ఒకటి ఇపుడు చర్చనీయాంశం అయింది. ఎన్టీఆర్‌ ఏదో తప్పు చేస్తే....రాజమౌళి అతనిపై సీరియస్ అయి మందలిస్తున్నట్లు, ఎన్టీఆర్ పశ్చాత్తాప పడుతూ తలదించుకున్నట్లు ఉందా ఫోటో. ఈ ఫోటోకు క్యాప్సన్ పెట్టండి అంటూ ఈ పోస్టు చేసారు రాజమౌళి. మరి ఈ ఫోటోకు ఎలాంటి క్యాప్షన్ బాగుటుంది? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్సులో రాయండి.

రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇప్పటి వరకు మూడు సినిమాలొచ్చాయి. ఎన్టీఆర్‌కు గుర్తింపు తెచ్చిన తొలి సినిమా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'స్టూడెంట్ నెం.1'. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'సింహాద్రి' చిత్రం ఎన్టీఆర్ మరింత పాపులర్ అయ్యాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో తర్వాత వచ్చిన 'యమదొంగ' చిత్రం మంచి విజయం సాధించింది.

ప్రస్తుతం ఈ ఇద్దరు ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, రాణా, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం రాజమౌళి ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. జూఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'రభస' చిత్రంలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీత నటిస్తున్న ఈచిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.

English summary
The clean bond of friendship and affection between Jr NTR, SS Rajamouli and Jr NTR, VV Vinayak is discussed more than once in many of Film Nagar circles. These directors always strived to give a break to Tarak whenever he was in dire situations. In fact all the major hits of Tarak like Aadi, Simhadri, Yama Donga are delivered by these two.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu