twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతర్జాతీయ వేదికపై రాజమౌళి, కీరవాణి.. లండన్‌లో బాహుబలి, అరుదైన గౌరవం!

    |

    దర్శకధీరుడు రాజమౌళికి బాహుబలి చిత్రం అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. రాజమౌళి బాహుబలి తర్వాత తన కొత్త చిత్రాన్ని కూడా ప్రారంభించేశాడు. అయినా కూడా బాహుబలి ఏదోఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఒక సౌత్ ఇండియన్ చిత్రంగా విడుదలైన బాహుబలి గురించి హాలీవుడ్ వాళ్ళు సైతం చర్చించుకున్నారు. బాహుబలి చిత్రం గురించి రాజమౌళి ఇండియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రసంగాలు చేశారు. తాజాగా రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం అందుకోబోతున్నారు.

    లండన్‌లో ప్రదర్శన

    లండన్‌లో ప్రదర్శన

    త్వరలో లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్స్ హాల్ లో హాలీవుడ్ చిత్రాలు స్కై ఫాల్, హ్యారీ పోటర్ అండ్ ది గ్లోబల్ ఫైర్ చిత్రాలతోపాటు బాహుబలి ది బిగినింగ్ హిందీ వర్షన్ ప్రదర్శన కూడా ఉండనుంది. ఈ కార్యక్రమానికి రాజమౌళి, కీరవాణి అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఆల్బర్ట్స్ హాల్ లో ప్రసంగించే అవకాశం దక్కించుకున్న తొలి సౌత్ ఇండియన్ సినీ ప్రముఖులుగా రాజమౌళి, కీరవాణి నిలిచారు.

    సంగీతం గురించి

    సంగీతం గురించి

    కీరవాణి ఈ వేదికపై బాహుబలి సంగీత గురించి ప్రసంగిస్తారట. బాహుబలికి ఇలాంటి అద్భుతమైన బ్యాగ్రౌండ్ సంగీత అందించడంలో ఎదురైన సవాళ్ల గురించి రాజమౌళి, కీరవాణి ప్రశ్నలు ఎదుర్కొనబోతున్నారు. సౌత్ ఇండియాలో అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కించిన ఈ చిత్రం మేకింగ్ గురించి కూడా రాజమౌళి తన ప్రసంగంలో పేర్కొనబోతున్నారు. బాహుబలి 1, 2 రెండు చిత్రాలని రాజమౌళి దాదాపు ఐదేళ్ల పాటు చిత్రీకరించారు. ఈ ఏడాది అక్టోబర్ లో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

    ఆర్ఆర్ఆర్‌తో మరోసారి

    ఆర్ఆర్ఆర్‌తో మరోసారి

    బాహుబలి తర్వాత రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కూడా కీరవాణే సంగీత దర్శకుడు. రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని 400 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి చిత్రం అంటే కీరవాణే సంగీత దర్శకుడు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఎలాంటి సంగీతం అందిస్తాడో చూడాలి.

    కల్పిత గాధ

    కల్పిత గాధ

    ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి 1920 కాలం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం, రామచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండడం విశేషం. వీరిద్దరూ ఒకే సమయంలో అదృశ్యమైన పీరియడ్ ని రాజమౌళి కల్పితగాధగా తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా భట్, డైసీ ఎడ్గార్ జోన్స్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    Rajamouli and Keeravani to attend Baahubali screening at Royal albert hall London
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X