twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఈగ’ కథాంశాన్ని ఓపెనింగ్ రోజునే ఓపెన్ గా చెప్పిన రాజమౌళి...

    By Sindhu
    |

    తన సినిమాలోని కథాంశం ఏమిటో ఓపెనింగ్ రోజునే ఓపెన్ గా చెప్పేసే దర్శక ధీరుడు రాజమౌళి తన తాజా చిత్రం 'ఈగ" కీ అదే ఫార్ములా అప్లై చేశారు..రిలీజ్ వరకూ చక్కగా చక్కర్లు కొట్టేలా 'ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ"ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ"కథాంశమట.! మరీ మరోజన్మ కాన్సెప్ట్ వినగానే మీకు 'మగధీర"గుర్తు రావచ్చు.

    అలాగే 'ఈగ" పగ తీర్చుకోవడం అనే పాయింట్ ఇతర జంతుజాలం ఆల్ రెడీ ఆ పని చేసేసిన మరెన్నో సినిమాలను మీ మదిలో కదిలించొచ్చు. కానీ వెండితెరపై ఏదోలా మోళీ చేసే రాజమౌళి ఈ కథాంశాన్నీ తనదైన శైలిలో ఓ వినూత్నమైన రీతిలో ఆవిష్కరిస్తారనేదే అందరి నమ్మకం. ఇక ఇతర విశేషాల్లోకి వెళితే నేడు(07.12.10) రామానాయుడు స్టూడియోస్ లో గ్రాండ్ గా ప్రారంభమైన 'ఈగ" చిత్రంలో నాని, సమంత ప్రేమజంటగా, కన్నడ హీరో సుదీప్ విలన్ గా నటిస్తున్నారు. అన్నట్టు ఈ చిత్ర ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులతో బాటు రాజమౌళి హీరోలైన 'యమదొంగ" ఎన్టీఆర్, మగధీర'రామ్ చరణ్, విక్రమార్కుడు, రవితేజ, మర్యాద రామన్న సునీల్ లు అతిథులుగా విచ్చేసి తొలి సన్నివేశాన్ని డైరెక్ట్ చేయ్యడం విశేషం.

    English summary
    Great and Successful director Rajamouli’s new film ‘Eega’ has been launched today (07.12. 2010) in Hyderabad. It was a grand event that witnessed the presence of many top celebrities of T-Town.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X