కరోనా కోసం నేను వాడిన రెండు ఆయుధాలు.. RRR, మహాభారతం ఎప్పుడంటే: రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి కరోనా నుంచి కోలుకున్న తరువాత ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో తన అనుభవాలను అలాగే భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరణ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం కరోనా భారిన పడిన జక్కన్న ప్లాస్మా డోనేషన్ తో ఇటీవల అందరికి ఆదర్శప్రాయంగా నిలిచారు. అయితే కరోనా టైమ్ లో ఆయన ప్రధానంగా రెండు విషయాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యి వైరస్ నుంచి భయటపడినట్లు చెప్పారు. అలాగే RRR, మహాభారతం, ఆది పురుష్ ప్రాజెక్తులపై కూడా మాట్లాడారు.

ఆ రెండు ఆయుధాలు..

ఆ రెండు ఆయుధాలు..

దర్శకధీరుడు రాజమౌళి కరోనా వైరస్ భారిన పడిన తరువాత ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిని కలిగించింది. అయితే ఆ విషయంపై స్పందించిన జక్కన్న తాను తీసుకున్న అతి ముఖ్యమైన జాగ్రత్తలు రెండే రెండు అంటూ.. ఒకటి శ్వాసకు సంబంధించిన వ్యాయామం, అలాగే ఆవిరి పెట్టుకోవడం. ఈ రెండింటిని కూడా రెగ్యులర్ గా ఫాలో అయితే కరోనా నుంచి బయటపడవచ్చని అన్నారు.

ఒక అరగంట ఆలోచిస్తే..

ఒక అరగంట ఆలోచిస్తే..

నిజానికి కరోనా వల్ల పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అంటూ కొంతమందికి సీరియస్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ రెగ్యులర్ గా జాగ్రత్తలు ఫాలో అయితే భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ముఖ్యంగా తగిన సమయంలో నిద్ర అవసరమని అలాగే టైమ్ కి ఫుడ్ తీసుకుంటే వైరస్ రాకుండా ఉండే అవకాశం ఉందని చెప్పారు. కేవలం మన మీద మనం రోజూ ఒక అరగంట శ్రద్దా తీసుకుంటే చాలని అన్నారు.

వాళ్లే నిజమైన దేవుళ్ళు..

వాళ్లే నిజమైన దేవుళ్ళు..

డిసెంబర్ వరకు ఈ వైరస్ ను అడ్డుకోవడం కష్టమని ముందు నుంచి కూడా అందరు చెబుతూనే ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో ఎంతో మంది వైద్యులు, పోలిసులు అలసిపోయి ఉన్నారని అన్నారు. ఒక విధంగా వాళ్ళే నిజమైన దేవుళ్ళని వాళ్ళు మనం చేయాల్సిన సహాయం ఏమిటంటే.. ఒక మాస్క్ ని ధరించి, చేతులు శుభ్రంగా కడుక్కొని ఉంటే చాలని వివరణ ఇచ్చారు.

RRR మోసం ఆరు నెలల సమయం..

RRR మోసం ఆరు నెలల సమయం..

ఇక సినిమా గురించి కూడా మాట్లాడిన రాజమౌళి RRR ఎప్పుడు వస్తుంది అని విషయంలో నిజంగా తనకు ఏ మాత్రం క్లారిటీ లేదని అన్నారు. అయితే షూటింగ్ మాత్రం ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ కూడా లేదని తెలిపారు. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజులు వెయిట్ చేయాలని అనుకుంటున్నట్లు చెబుతూ ఒకవేళ షూటింగ్ స్టార్ట్ అయితే ఆరు నెలల సమయంలో పనులను పూర్తి చేసేలా సిద్ధమవుతామని అన్నారు.

మహాభారతం పదేళ్ల ప్రాజెక్ట్..

మహాభారతం పదేళ్ల ప్రాజెక్ట్..

మహాభారతం గురించి స్పందించిన రాజమౌళి ఆ సినిమాను తెరకెక్కించాలి అంటే బాహుబలి కంటే పదింతలు ఎక్కువగా కష్టపడాలని నేను చాలా చాలాసార్లు చేయాలని అనుకున్నట్లు చెప్పాను గాని దాని మీద కొంత కూడా ఇప్పుడు ఐడియా లేదని అన్నారు. ఓకేవేళ తీస్తే 10ఏళ్ళ సమయం పట్టవచ్చని కూడా తెలియజేశారు.

Recommended Video

Metro Kathalu Movie Actor Thiruveer Special Interview || అలా చేస్తే తప్పు కానీ నటించడం తప్పు కాదు!
ప్రభాస్ ఆది పురుష్..

ప్రభాస్ ఆది పురుష్..

ప్రభాస్ ఆది పురుష్ గురించి వివరణ ఇస్తూ.. అయోధ్యలో రామ మందిరం నిర్మితమవుతున్న తరుణంలో నిజంగా ఇలాంటి ప్రాజెక్ట్ సెట్టవ్వడం మంచి విషయమని చెప్పాలి. ఇప్పటికే ప్రభాస్ రేంజ్ భారీ స్థాయిలో పెరిగింది. ఇక ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. ఆ సినిమా పోస్టర్ కూడా చూడగానే చాలా బాగా నచ్చిందని రాజమౌళి వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X