మహావీర్ గా చిరు: రాజమౌళి చేతులమీదుగానే
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మోషన్ పోస్టర్ రిలీజ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా వుండనున్నట్టు సమాచారం.
చిరంజీవి 151వ చిత్రంగా చేస్తోన్న 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.
Gallery : Memorable Pictures Of Chiranjeevi

ఎఆర్ రెహమాన్ పక్కా ?
మహావీర్ ఉరఫ్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ప్రాజెక్టుకు సంగీత దర్శకుడిగా ఎఆర్ రెహమాన్ పక్కా అయ్యారని వార్తలు వినవస్తున్నాయి. ఒక హీరోయిన్ గా నయనతార ఓకె అయింది. మరో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ తో చర్చలు సాగుతున్నాయి. కానీ ఇంకా పక్కా కాలేదు. 22 నాటికి సెటిల్ అవుతుందా? అన్నది చూడాలి.

సుదీప్, ఐశ్వర్య, నయనతార
ఐశ్వర్య ఈ ప్రాజెక్టుకు తోడయితే కచ్చితంగా మాంచి బజ్ వస్తుంది. మరోపక్క కన్నడ స్టార్ సుదీప్ ను తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇలా సుదీప్, ఐశ్వర్య, నయనతార తోడయితే, పక్కాగా నేషనల్ రేంజ్ వస్తుంది. స్క్రిప్ట్ పక్కా గా సిద్దం చేసుకున్న తరవాతనే షూటింగ్ మొదలు పెట్టాలి అనేది చిరంజీవి లెక్క.

అసలు గ్యాప్ లేకుండా
రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యాక అసలు గ్యాప్ లేకుండా చిత్రం ఫాస్ట్ గా లాగించాలి అని ఇప్పటికే సురేందర్ రెడ్డికి చెప్పేశాడట చిరు. వచ్చే వేసవి కి తన చిత్రం విడుదల అయ్యి తీరాలి అనేది చిరు ప్లాన్ గా చెబుతున్నారు . ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అలియాస్ మహావీర్ కోసం చాలా కామ్ గా ఇటీవలే హోమాలు, పూజులు జరిపించి, సింపుల్ గా ఓపెనింగ్ చేసేసారు.

రాజమౌళి చేతుల మీదుగా
శ్రావణమాసం వెళ్లిపోతోంది కాబట్టి, చిరు బర్త్ డే దాకా ఆగలేదు. కానీ అసలు సిసలు ఫంక్షన్ చిరు బర్త్ డే నాడు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చేస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ రిలీజ్ వుండనున్నట్టు సమాచారం.

ఘనంగా ఈవెంట్
మోషన్ పోస్టర్ రిలీజ్ కి సంబంధించిన ఈవెంట్ ను ఘనంగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ ఒక కీలకమైన పాత్రలో నటించనుండగా, నయనతార కథానాయికగా కనిపించనుంది.


Click it and Unblock the Notifications











