Pushpa pre release eventలో బన్నీకి షాకిచ్చిన రాజమౌళి.. ప్రమోట్ చేయండి అంటూ కామెంట్స్!
హైదరాబాద్ యూసఫ్ గూడ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నలుగురు దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి, విలక్షణ దర్శకుడు కొరటాల శివ, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా, చలో సినిమా దర్శకుడు వెంకీ కుడుముల అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

చాలా ఇష్టం
ఈ రోజు ఒక రకంగా తనకు ఒక పక్క బాధ మరో పక్క చాలా ఆనందంగా ఉందని రాజమౌళి చెప్పుకొచ్చారు. బాధ ఎందుకు అంటే తన బెస్ట్ ఫ్రెండ్ తన ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ ఇక్కడ లేడు, బాంబే లో ఫుల్ బిజీగా ఉన్నాడు, పుష్ప సినిమాను వీలయినంత అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన కష్టపడుతున్నాడు అని రాజమౌళి చెప్పుకొచ్చారు. నాకు సుకుమార్ అంటే చాలా ఇష్టమని పేర్కొన్న రాజమౌళి సుకుమార్ సినిమాలు అంటే కూడా చాలా ఇష్టం అని అన్నారు. మేము ఇద్దరమూ ఒకళ్ళకు ఒకళ్ళు మెసేజీలు పెట్టుకుంటూ ఉంటామని, మా ఇద్దరిదీ మ్యూచువల్ అడ్మిరేషన్ ఫ్యాన్ క్లబ్ అని చెప్పుకొచ్చారు.

సార్ చింపేశారు అని
సుకుమార్ నుంచి ఏదైనా రిలీజ్ అయితే అదిరి పోయిందని నేను, నా నుంచి ఏదైనా రిలీజ్ అయితే సార్ చింపేశారు అని సుక్కు ఒకళ్ళని ఒకళ్ళని పొగుడుకుంటూ ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే ఈ మధ్య పెడుతున్న మెసేజ్ లలో ఎక్కువగా టైం సరిపోవడం లేదు టైం సరిపోవడం లేదు అని పెడుతున్నాడు అని రాజమౌళి వెల్లడించారు. ఆయన అలా అంటుంటే నేను సుకుమార్ కు ఒక మెసేజ్ పెట్టాను అని చెబుతూ ఆ మెసేజ్ ఏంటో కూడా రాజమౌళి వివరించారు.. నువ్వు చేస్తున్న సినిమా మీద నమ్మకం పెట్టు, సినిమా కోసం నువ్వు ఎంత కష్టపడ గలవో కష్టపడమని చెబితే చాలా ఆనందించాడు అని రాజమౌళి వెల్లడించారు.

రాత్రి పగలు తేడా లేకుండా
ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాత్రి పగలు తేడా లేకుండా సుకుమార్ కష్టపడుతున్నాడు అని రాజమౌళి వెల్లడించారు.. ఇక తన సినిమా పనుల మీద తరచూ ముంబై వెళుతున్నప్పుడు నేను గమనించిన విషయం ఏమిటంటే బాలీవుడ్ ప్రేక్షకులు కూడా పుష్పా సినిమా కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అని రాజమౌళి వెల్లడించారు. ఈ పుష్పా సినిమా చాలా మంచి సబ్జెక్ట్ అని ప్రమోషన్స్ ఇంకా గట్టిగా చేయాలి అని అల్లు అర్జున్ కి రాజమౌళి సూచనలు చేశారు. నీ చేతిలో ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది దీనిని అలా ఊరికే వదిలేయ వద్దు, ఎంత దూరం ప్రమోట్ చేయగలిగితే అంత దూరం ప్రమోట్ చేయాలి అని రాజమౌళి పేర్కొన్నారు.

కళ్ళు చెదిరిపోయాయి
పుష్ప టీజర్ వచ్చినప్పుడు కళ్ళు చెదిరిపోయాయి అని, ఆ టీజర్ లో అన్ని విషయాల కంటే బాగా నచ్చింది విజువల్స్ అని ఆయన అన్నారు. తనకు సినిమాటోగ్రాఫర్ పేరు తిరగడం లేదు కానీ ఆయన మాత్రం అద్భుతంగా సినిమాటోగ్రఫీ అందించారు అని రాజమౌళి అన్నారు. సినిమాని నెక్ట్స్ లెవల్కి సినిమాటోగ్రాఫర్ తీసుకు వెళ్ళాడు అని చెబుతూ ఆయనకు ధన్యవాదాలు చెప్పారు రాజమౌళి. ఇక ఫైట్స్ విషయంలో కూడా రామ్-లక్ష్మణ్ మాస్టర్ లు అలాగే మా సొంత మనిషి గా భావించే పీటర్ హెయిన్ చాలా అద్భుతంగా చేశారు అని రాజమౌళి వెల్లడించారు.

మీ డెడికేషన్ కి హాట్సాఫ్
ఇక అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ మీ డెడికేషన్ కి హాట్సాఫ్ అంటూ రాజమౌళి చెప్పారు.. నువ్వు పెట్టే ఎఫర్ట్ కి నువ్వు పడిన కష్టానికి, దర్శకుడి మీద నీకున్న నమ్మకానికి అన్నింటికీ కలిపి నీకు హ్యాట్సాఫ్. నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గిఫ్ట్. పుష్ప సినిమా బాగా ఆడాలని కోరుకోవడంలో నాకు స్వార్థం ఉంది నాకు అంటే నాకు కాదు తెలుగు సినీ పరిశ్రమకు ఒక స్వార్థం ఉంది ఇది తెలుగు సినిమా ఇది మరింత ముందుకు వెళ్ళాలి అని రాజమౌళి కోరుకున్నారు. నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి అవుతారు, నీలాగా నువ్వు పడిన కష్టం చాలామంది పడాలి ఎంత కష్టపడితే నీ అంత ఎత్తు ఎదుగుతాం అనే విధంగా నువ్వు అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉన్నావ్ అని చెప్పుకొచ్చారు.
Recommended Video

ఆల్ ది బెస్ట్ కూడా
ఇక పుష్పా సినిమాకి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాల్సిన అవసరం లేదని ఎందుకంటే అది కచ్చితంగా బాక్స్ లు బద్దలు కొడుతుందని, అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కడ ఓపెన్ చేస్తే అక్కడ కంప్లీట్ గా ఖాళీ అయిపోతుంది, ఈ మాట వినడానికి చాలా బాగుంది, ఫైనల్ గా డిసెంబర్ 17 ఫస్ట్ డే ఫస్ట్ షో పుష్పాను కేవలం థియేటర్లలోనే చూడండి అని రాజమౌళి ముగించారు. 'పుష్ప ది రైజ్' చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. సునీల్, అనసూయ ప్రతినాయక పాత్రలు పోషించగా, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలకు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











