9 ఏళ్ల తర్వాతే ఆ సినిమా: షాక్ ఇచ్చిన రాజమౌళి
హైదరాబాద్: మహా భారతాన్ని తెరకెక్కించాలని ఉందని, అందుకు సంబంధించిన బ్యాగ్రౌండ్ వర్క్ మొదలు పెడతామని దర్శకుడు రాజమౌళి కొన్ని నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. రాజమౌళి ప్రకటనతో చాలా మంది అభిమానులు రాజమౌళి స్టైల్ లో మరోసారి వెండి తెరపై మహా భారతాన్ని చూడబోతున్నాం అంటూ ఆనంద పడ్డారు.
అయితే తాజాగా దర్శకుడు రాజమౌళి ఈ సినిమా విషయమై షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. 'మహా భారతాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలనేది నా కోరి. దానికి చాలా అనుభవం కావాలి. మరో 9 సంవత్సరాల తర్వాత ఆ సినిమా ప్రారంభిస్తానేమో' అంటూ ప్రకటించారు.
రాజమౌళి ప్రకటన విన్న అభిమానులు... మరీ అన్ని సంవత్సరాలా? అంటూ అసంతృప్తికి లోనవుతున్నారు. 9 ఏళ్ల తర్వాత సినిమా ప్రారంభం అయితే అది పూర్తయి విడుదల కావడానికి మరో ఒకటి రెండు సంవత్సరాలు అనదనం. అంటే మరో దశాబ్దం తర్వాత కానీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చే 'మహా భారతం' సినిమాను చూడలేమన్నమాట.
రాజమౌళి సినిమాల విషయానికొస్తే..
ఇటీవలే 'ఈగ' చిత్రంతో హిట్ కొట్టిన రాజమౌళి... తర్వాత ప్రభాస్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్, భారీ తారాగణం, భారీ హంగుళతో రూపొందుతున్న ఈచిత్రం తెలుగు సినిమా చరిత్రలో గొప్ప చిత్రంగా తీర్చిద్దేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











