కాకతీయులపై రాజమౌళి సినిమా
'ఈగ' సక్సెస్ టూర్లో భాగంగా రాష్ట్రమంతటా పర్యటిస్తున్న దర్శకుడు రాజమౌళి ఇటీవల కాకతీయుల ఖిల్లా వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....వరంగల్ నగరానికి ఎంతో చారిత్రక చరిత్ర ఉందని, త్వరలో కాకతీయుల కాలంలో ఓరుగల్లు నేపథ్యాన్ని తీసుకుని సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. సినిమాలు చిత్రీకరించడానికి వరంగల్‌లో మంచి లొకేషన్లు ఉన్నాయని చెప్పారు.
రాజమౌళి వరంగల్ నేపథ్యాన్ని ఎన్నుకున్నారంటే అదొక చారిత్రక ఛాయలున్న కథ అయి ఉంటుందని ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు అంచనా వేస్తున్నారు. సినిమా తీసే ముందు తను ఎంచుకున్న సబ్జెక్టుకు వెనక ఉన్న పూర్తి విషయాలు తెలుసుకోవడం రాజమౌళికి అలవాటు. ఈ నేపథ్యంలో ఆయన వరంగల్ చరిత్రపై స్టడీ చేయడంతో పాటు, అక్కడ పర్యటించే అవకాశాలు కూడా లేక పోలేదు.
ప్రస్తుతం ఈగ చిత్రం విజయంతో చాలా హ్యాపీగా ఉన్న జక్కన్న...తనకు ఇంతటి విజయాన్ని చేకూర్చిన ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈగ చిత్రానికి ఈ రేంజిలో రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఊహించ లేదని, త్వరలో ఈగ 3డి వెర్షన్ విడుదల చేస్తామని ఇటీవల ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











