హాట్ న్యూస్: శ్రీకృష్ణదేవరాయలపై రాజమౌళి చిత్రం
రాజమౌళి తన తాజా చిత్రం ఈగ ప్రమోషన్ లో భాగంగా బెంగుళూరు వెళ్లారు. అక్కడ ఆయన తాను ఓ కన్నడ చిత్రం ప్లాన్ చేస్తానని హింట్ ఇచ్చారు. అంతేగాక ఆ చిత్రం సబ్జెక్టు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి విజయనగర సామ్రాజ్యం పై ఉంటుందని హింట్ ఇచ్చారు. అయితే ఆ చిత్రం ఎప్పుడు చేస్తారు..ఎవరితో చేస్తారు వంటి వివరాలు ఏమీ చెప్పలేదు. దాంతో రాజమౌళి తన తర్వాత వెంచర్ గా ప్రభాస్ తో చేయబోయే చిత్రం ఇదేనా అని సందేహాలు కలుగుతున్నాయి.
రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'. వచ్చే నెల 6 న విడుదల అవుతున్న ఈ చిత్రంపై ట్రేడ్ లో చాలా అంచనాలు ఉన్నాయి. అపజయమెరగని దర్శకుడు రాజమౌళి..భారీ వ్యయంతో,పెద్ద హీరోలెవరూ లేకుండా చిత్రం తీసి రిలీజ్ చేయటం అందరిలో ఆసక్తి నింపుతోంది. డి.సురేష్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ప్రేమ వల్ల ప్రాణాలు కోల్పోయిన ఓ యువకుడు పగతో 'ఈగ'లా పుట్టి తన పగను ఎలా తీర్చుకున్నాడనే కధతో రూపొందిన సైంటిఫిక్ ధ్రిల్లర్ ఇది.
ఈ చిత్రం విడుదల సందర్భంగా రాజమౌళి ఓ ప్రకటన విడుదల చేసారు. ఆ ప్రకటనలో...''నా కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన సినిమా. ప్రేమ, పగ నేపథ్యంలో సినిమా సాగుతుంది. హృదయాలను బరువెక్కించే సన్నివేశాలు ఇందులో చాలా ఉంటాయి.
అలాగే ఉత్కంఠను రేకెత్తించే సీన్స్ కూడా కోకొల్లలు. ఈ సమ్మర్‌లో పిల్లల నుంచి పెద్దల వరకూ అన్ని వయసుల వారినీ రంజింపజేసే సినిమా అవుతుంది. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది'' అని తెలిపారు.
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు గా రూపొందే ఈ చిత్రాన్ని ఫేస్ బుక్,ట్విట్టర్,మీడియా,టీవీ ఛానెల్స్ అనే తేడా లేకుండా భారీ లెవల్లో పబ్లిసిటీ చేస్తున్నారు. ఆయన తాజాగా ఈ చిత్రం కధ గురించి చెబుతూ తమ చిత్రం నాని,బిందుల ల మధ్య లవ్ స్టోరీ అన్నారు. నాని పాత్రలో నాని,బిందు పాత్రలో సమంత నటిస్తోంది అన్నారు. మధ్యలో సుదీప్ పాత్ర ప్రవేసించి ఏమి చేసిందనేదే కథ అంటున్నారు.


Click it and Unblock the Notifications











