రాజమౌళి రామాయణం తీయాలి.. నెటిజన్ల డిామాండ్.. ట్విట్టర్‌లో ట్రెండింగ్

దేశవ్యాప్తంగా కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్‌ను పాటిస్తున్న ప్రజలకు కాలం వెళ్లదీయడానికి వినోదమే ప్రధాన ఆస్త్రంగా మారింది. ఇంట్లో ఉంటూ వినోదాన్ని ఆస్వాదించే బుల్లి తెర ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ పలు టెలివిజన్ చానెళ్ల నిర్వాహకులు అత్యంత ప్రజాదరణ పొందిన సీరియల్స్‌ను బయటకు తీసి ప్రసారం చేశారు. అందులో భాగంగానే ఈ తరం ప్రేక్షకులకు రామాయాణాన్ని జాతీయ డీడీ ఛానెల్ అందుబాటులోకి తెచ్చింది. అయితే అంచనాలను మంచి రామాయణం సీరియల్‌కు ప్రేక్షకాదరణ దక్కిన నేపథ్యంలో ఇప్పుడు రామాయణం సినిమాను రాజమౌళి తీస్తే బాగుంటుందనే డిమాండ్ దేశవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. అదేమిటో మీరే చూడండి..

Recommended Video

RRR Update : SS Rajamouli's New Strategy To Release RRR
 డీడీ నేషనల్‌లో మంచి స్పందన

డీడీ నేషనల్‌లో మంచి స్పందన

దూరదర్శన్ నేషనల్ ఛానెల్‌లో రామాయణం సీరియల్ మార్చి 28న మొదటి ఎపిసోడ్ ప్రారంభమైంది. బార్క్ (బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్) తెలిపిన ప్రకారం.. శనివారం (ఏప్రిల్ 25న) ప్రసారమైన రెండు ఎపిసోడ్స్‌ను 34 మిలియన్స్ వీక్షించారు. ఆదివారం (ఏప్రిల్ 26న) ప్రసారమైన ఎపిసోడ్స్‌ను దాదాపు 51 మిలియన్ల మంది వీక్షించారు. గత కొన్నేళ్లుగా ప్రసారమైన సీరియల్స్‌ అన్నింటిలో ఇదే గొప్ప రికారు. ఇలా మొత్తంగా రామాయణం సీరియల్‌కు మొదటి వారంలో 85మిలియన్ వ్యూస్ దక్కాయి అని వెల్లడించారు.

రాజమౌళి తీయాలని డిమాండ్

రాజమౌళి తీయాలని డిమాండ్

రామాయణం సీరియల్‌కు ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో మళ్లీ ఈ భారతీయ ఇతిహాస కథను వెండి తెరపైకి తీసుకు రావాలనే డిమాండ్ మొదలైంది. ఇప్పటికే మహాభారతం, రామాయణం సినిమాలను రూపొందించాలని దర్శక ధీరుడు రాజమౌళి, అమీర్ ఖాన్ లాంటి ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో బాహుబలితో విశేష ప్రేక్షకాదరణ దక్కించుకొన్న రాజమౌళి చేతుల మీదుగా రామాయణం తెరకెక్కాలనే డిమాండ్ వస్తున్నది. ఈ మేరకు RajamouliMakeRamayan అనే ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.

వాల్మికి.. రామానంద సాగర్.. ఇప్పుడు రాజమౌళి

రామాయణాన్ని మొదట వాల్మికి రుషి రాశారు. దానిని మళ్లీ తులసీదాస్ రాశారు. ఆ తర్వాత రామానంద సాగర్ తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు ఇక మనముందు న్న ప్రశ్నేమిటంటే.. రామాయణ్: ది లజెండ్ రాజారాం అనే పేరుతో రామాయణాన్ని దర్శకుడు రాజమౌళి రూపొందిస్తే బాగుంటుంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

భావి తరాలకు గుర్తుండిపోయే విధంగా

ఒకవేళ ఎస్ఎస్ రాజమౌళి రామాయణాన్ని సినిమాగా తీస్తే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా మారుతుంది. ఈ తరమే కాదు.. భావి తరాల వారికి కూడా గుర్తుండిపోతుంది. గతంలో ఆయన తనకు తీయాలనే ఆలోచన ఉన్నట్టు చెప్పారు కూడా. సార్ దయచేసి రామాయణాన్ని తెరకెక్కించండి అంటూ మరో నెటిజన్ రిక్వెస్ట్ చేశారు.

ఇది మా రిక్వెస్ట్.. అంగీకరించండి

పిరికితనం, బలహీనమైన మనస్తత్వంపై దైవంపై భారం వేసేలా చేస్తాయి. కానీ ఆత్మవిశ్వాసం, బలమైన ఆలోచనలు లక్ష్యం, అదృష్టాన్ని సొంతం చేసుకొనేందుకు ఉపయోగపడుతాయి. రాజమౌళి సార్.. మీరే మాకు ఆశాకిరణం. రామాయణాన్ని మీరే తీయాలి. ఇదే మా రిక్వెస్ట్.. దీనిని మీరు అంగీకరించండి అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

శ్రీరామచంద్రుడిపై గొప్పగా సినిమా

రాముడు అనేది ఓ పేరు మాత్రమే కాదు.. భారత దేశానికి ఆత్మ లాంటింది. అతడి గొప్ప జీవితం ప్రపంచంలోని ప్రతీ ఒక్కరికి అద్భుతమైన సందేశం. శ్రీరామచంద్ర ప్రభువు జీవితంపై మీరు గొప్పగా సినిమాను తీయాలి అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X