twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి ‘మక్కి’ ఫస్ట్ లుక్

    By Bojja Kumar
    |

    ముంబై: తెలుగులో సూపర్ హిట్ అయిన 'ఈగ' చిత్రాన్ని హిందీలో 'మక్కి' పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. అక్టోబర్ 12 'మక్కి' చిత్రం విడుదలువతోంది. రిలయన్స్ ఎంటర్ టైనర్ వారు ఈచిత్రాన్ని బాలీవుడ్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈచిత్రంలో రాజమౌళి దర్శకత్వానికి, సుదీప్ నటనకు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేసేశారు. భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకుంది.

    ఈగ తెలుగు వెర్షన్‌లో టాలీవుడ్ టాప్ హీరోలను ఇమిటేట్ చేస్తూ స్టెప్పులేసింది. అయితే హిందీలోనూ అదే సీన్లు పెడితే అక్కడి ప్రేక్షకులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున.... బాలీవుడ్ టాప్ హీరోల డాన్స్ ను ఇమిటేట్ చేసేలా ఆ సీన్లను మోడరేట్ చేసినట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్లో సల్మాన్, హృతిక్ రోషన్ లాంటి వాళ్ల డాన్స్‌ను ఈగతో చేయిస్తారట

    త్వరలో ఈగ చిత్రాన్ని భారత్ తరుపున ఆస్కార్ అవార్డుల నామినేషన్ కు పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎఫ్ఐ) సభ్యులు హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్న 'ఈగ' స్పెషల్ షో తిలకించిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డులుక నామినేట్ చేయబోతున్నట్లు సమాచారం. త్వరలో ఈ విషయమై పూర్తి వివరాలు తెలియనున్నాయి.

    రాజమౌళి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించగా సురేష్ బాబు సమర్పణలో విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్ కుమార్.

    English summary
    The Nani-Samantha starrer Eega, which created waves at the Southern box office a couple of months back, is all game to release in the Hindi version as Makki on October 12. And Reliance Entertainment is releasing Makki on a grand scale.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X