రాజమౌళి 'మర్యాద రామన్న' రిలీజ్ డేట్ మారింది
సునీల్, సలోని జంటగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న కామిడీ ఎంటర్టైనర్ 'మర్యాద రామన్న' జూలై 23న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథలో సలోని హీరోయిన్ గా చేస్తోంది. మొదట ఈ చిత్రం డేట్ జూలై 16న అన్నారు కానీ ఇప్పుడు 23కి జరిపారు. ఇక చిత్ర కథలో ఎక్కువ భాగం ఓ ఇంటిలో జరుగుతుందని, మర్యాదలకు ఎక్కువ విలవనిచ్చే రాయలసీమ నేఫద్యంలో ఈ చిత్రం జరగనుంది. కథ ప్రకారం అమెరికాలో ఉండి వచ్చిన సునీల్ తన ఊళ్లో ప్యాక్షన్ హత్యలు లేకుండా చేయాలని ప్రత్యర్ధి ఇంటికెళ్ళి ఇరుక్కుంటాడు. అక్కడ మర్యాదలు ప్రకారం ఇంటికొచ్చిన అతిధిని ఏమీ చేయకూడదు.
అలా ఇంటిలోకి వచ్చి పడిన సునీల్ ని బయిటకు గెంటాలని ఆ ప్రత్యర్ధుల ఫ్యామిలీ ప్లాన్ చేస్తూంటుంది. గుమ్మం దాటితే తల తెగుతుందని సునీల్ అక్కడే ఉండి వారిలో ఎలా మార్పు తెస్తాడన్నది కథ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇందులో బ్రహ్మనందం, నాగినీడు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి యం యం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.ఆర్కా మీడియా పతాకంపై వేదం నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగే ఒక్క పాటతో ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లే అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











