Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజమౌళి 'మర్యాద రామన్న' రిలీజ్ డేట్ ఎప్పుడంటే...
'మగధీర' వంటి మెగా హిట్ చిత్రం అనంతరం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న కామిడీ ఎంటర్టైనర్ 'మర్యాద రామన్న'. సునీల్,సలోని జంటగా చేస్తున్న ఈ చిత్రం జూలై 16న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్ర కథ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కామిడీగా జరుగుతుందని తెలుస్తోంది. కథలో ఎక్కువ భాగం ఓ ఇంటిలో జరుగుతుందని, మర్యాదలకు ఎక్కువ విలవనిచ్చే రాయలసీమ నేఫద్యంలో ఈ చిత్రం జరగనుంది. కథ ప్రకారం అమెరికాలో ఉండి వచ్చిన సునీల్ తన ఊళ్లో ప్యాక్షన్ హత్యలు లేకుండా చేయాలని ప్రత్యర్ధి ఇంటికెళ్ళి ఇరుక్కుంటాడు. అక్కడ మర్యాదలు ప్రకారం ఇంటికొచ్చిన అతిధిని ఏమీ చేయకూడదు.
అలా ఇంటిలోకి వచ్చి పడిన సునీల్ ని బయిటకు గెంటాలని ఆ ప్రత్యర్ధుల ఫ్యామిలీ ప్లాన్ చేస్తూంటుంది. గుమ్మం దాటితే తల తెగుతుందని సునీల్ అక్కడే ఉండి వారిలో ఎలా మార్పు తెస్తాడన్నది కథ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రంలోనూ రాజమౌళి..గ్రాఫిక్స్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చాడని చెప్తున్నారు. ఇక 'మర్యాద రామన్న' చిత్రం ఓ కామిడీ ఫిల్మ్, అలాగని అదేమీ స్లాఫ్ స్టిక్ కామిడీ కాదు. అలాగే నా తరహా రెగ్యులర్ చిత్రం కాదు. చూద్దాం ఈ ఎక్సపెరిమెంట్ ఎలా వర్కవుట్ అవుతుందో అంటున్నారు రాజమౌళి.ఇందులో బ్రహ్మనందం, నాగినీడు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి యం యం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.