‘టైగర్ ఫుడ్’ రెడీ చేస్తున్న రాజమౌళి! (ఫోటో)
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసిన ఓ ఫోటో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇందులో రాజమౌళి టామోటోతో తయారు చేసిన పులిహారను మిక్స్ చేస్తున్నారు. దీన్ని రాజమౌళి సతీమణి రమ తయారు చేసారట. టామోటో పులి హార తయారు చేయడంలో ఆమె ఎక్స్‌పర్ట్ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.
కాగా...ఈ ఫోటోపై కొందరు రాజమౌళి ఫ్యాన్స్ సరదా కామెంట్స్ కూడా చేస్తున్నారు. 'పులి హార'కు 'టైగర్ ఫుడ్' ఓ నిక్‌నేమ్ ప్రచారంలో ఉంది. రాజమౌలి తన తాజా సినిమా 'బాహుబలి'లోని హీరోల కోసమే ఈ టైగర్ ఫుడ్ రెడీ చేస్తున్నారా? వాళ్లని వీరుల్లా తెరపై చూపేందుకు చాలా కష్టపడుతున్నారు అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.

బాహుబలి సినిమా విషయానికొస్తే...రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, రాణా, రమ్య కృష్ణ, సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.
తాజాగా ఈచిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ విశేషాలను రాణా వివరిస్తూ.....ఈ షెడ్యూల్ మొత్తం ఓమారథాన్‌లా సాగింది. ఉదయం 7 గంటలకు రాత్రి 10 గంటలకు వరకు షూటింగ్. అర్థరాత్రి వరకు కూడా ట్రైనింగ్ జరిగింది' అంటూ ట్వీట్ చేసాడు. 'ఒక వారాంతం అయితే ఆదివారం ఉదయం 7 గంటల నుంచి నాన్ స్టాప్‌గా సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటలు పని సాగింది' అని రాణా వెల్లడించారు.
దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











