»   »  షాక్... రాజమౌళికి ‘పద్మశ్రీ’ అలా వచ్చిందా?

షాక్... రాజమౌళికి ‘పద్మశ్రీ’ అలా వచ్చిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ అవార్డుల్లో దర్శకుడు రాజమౌళికి కూడా స్థానం దక్కిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును రాజమౌళి అందుకోబోతున్నారు. రాజమౌళికి ఈ అవార్డు వచ్చిన సంగతి తెలియగానే తెలుగు ప్రేక్షకులు సంతోష పడ్డారు. ఆయన టాలెంటుకు తగిన గుర్తింపు వచ్చిందని చర్చించుకుంటున్నారు.

రాజమౌళికి ‘పద్మశ్రీ' దక్కడంపై వర్మ కామెంట్స్!

షాకింగ్ విషయం ఏమిటంటే.... రాజమౌళికి ‘పద్మశ్రీ' రావడం వెనక కారణం తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదు. మన పొరుగున ఉన్న కర్నాటక ప్రభుత్వం రాజమౌళి పేరును రికమండ్ చేసింది. అలా ఆయనకు ఈ అవార్డు దక్కింది. రాజమౌళి టాలెంటును మన తెలుగు ప్రభుత్వాలు గుర్తించక పోయినా పరభాషా ప్రభుత్వం అయినా గుర్తించినందుకు ఆయన అభిమానులుగా గర్వపడుదాం అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

 Rajamouli name was recommended by Karnataka

కర్ణాటక రాష్ట్రంలోని రాయ్ చూర్ లో రాజమౌళి జన్మించారు. కన్నడలో ‘కంటీరవ' అనే ఒక్కటంటే ఒక్కటే సినిమాకు రచయితగా పని చేసారు. బాహుబలి సినిమా వచ్చే వరకు రాజమౌళి పేరు చాలా మంది కన్నడ ప్రేక్షకులకు తెలియదు. బాహుబలి సినిమా తర్వాతే రాజమౌళి పూర్తి స్థాయిలో కర్నాటకతో పాటు నేషనల్ లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు.

అవార్డులకు ఎంపికైన ఇతర సెలబ్రిటీలు...
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించే పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. సినిమా రంగం నుండి ఈ సారి రజనీకాంత్‌కు ‘పద్మ విభూషణ్' పురస్కారం అందుకోబోతున్నారు. అదే విధంగా అనుపమ్ ఖేర్, గాయకుడు ఉదిత్ నారాయణ్ కు పద్మభూషణ్ లకు అవార్డును ప్రకటించారు.అదే విధంగా బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, ప్రియాంక చోప్రాలకు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.

English summary
Rajamouli name was recommended by Karnataka government for the Padmasri award and not by the Telangana or Andhra government.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu