పదహారు నుంచే..రాజమౌళి
మగధీర విజయానందంలో ఉన్న రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టు మర్యాద రామన్న ను ఈ నెల పదహారు నుంచి ప్రారంభించనున్నారు. సునీల్ హీరోగా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో సునీల్ సరసన సలోని హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఎప్పటిలాగే రాజమౌళి టెక్నికల్ టీమ్ మొత్తం ఈ చిత్రానికి పనిచేస్తోంది. అయితే ఈ సారి కెమెరామెన్ సెంధిల్ కుమార్ మాత్రం ఈ చిత్రానికి పనిచేయటం లేదు. ఆ అవకాశాన్ని శ్యామ్.కె.నాయుడు పొందారు. అలాగే కీరవాణి్ ఇప్పటికే ట్యూన్స్ రెడీ చేసేసారు. పూర్తి స్క్రిప్టు వర్క్ తో షూటింగ్ కి బయిలుదేరుతున్నారు. ఇక కథ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో అక్కడి మర్యాదలను బేస్ చేసుకుని అల్లారని తెలుస్తోంది. ఆర్కా మీడియా వర్క్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని శోభా యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం గురించి రాజమౌళి చెపుతూ నా రెగ్యులర్ సినిమా నుంచి బయిటకు వచ్చి చేస్తున్నా. అలాగని ఆర్ట్ సినిమా మాత్రం కాదు. నేను లవ్ స్టోరీలు తీయలేను. ఇది ఓ కామిడీ ధ్రిల్లర్. నా ప్రెండ్ వర ముళ్లపూడి(నా అల్లుడు డైరక్టర్) ఈ స్టోరీ లైన్ చెప్పారు. అప్పుడు సునీల్ ఈ కధకు కరెక్టుగా సరిపోతాడనిపించింది. రాయలసీమ నేపధ్యంలో ఈ కథ సాగినా ఫ్యాక్షన్ మాత్రం ఉండదు. రాయలసీమ అతిధి మర్యాదలకు పేరు పడింది. అక్కడ జరిగే అతిధి మార్యాదలే ప్రధానాంశంగా ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో సునీల్ పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. కానీ చూసేవాళ్లకు కామెడీ పంచుతుంది అన్నారు. బ్రహ్మానందం ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఛోటా కె.నాయుడు కెమెరా అందిస్తూంటే, కాంచి ఈ చిత్రానికి కథ, రవీందర్ ఆర్ట్ డైరక్షన్, రమా రాజమౌళి స్టైలింగ్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











