బ్రహ్మానందం హీరోగా రాజమౌళి చిత్రం?
సునీల్ హీరోగా మర్యాదరామన్న వంటి హిట్ ఇచ్చిన రాజమౌళి ప్రస్తుతం ఈగ పనిలో బిజీగా ఉన్నారు.అయితే ఈగ తర్వాత ప్రభాస్ చిత్రం చేయాల్సి ఉంది.అయితే ఈ మద్యలో గ్యాప్ వచ్చేటట్లు ఉంది.మరో ప్రక్క ఈగ చిత్రం గ్రాఫిక్ వర్క్ కి చాలా లేటయ్యేటట్లు ఉంది.ఇది గమనించిన రాజమౌళి ఈ గ్యాప్ లో ఓ చిన్న కామిడీ చిత్రం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకు బ్రహ్మానందం ను హీరోగా తీసుకుని చేయాలని ఆయన ఆలోచనగా వినపడుతోంది.అందుకు సంభందించి ఓ స్క్రీప్టుని విజయేంద్రప్రసాద్ నేరేట్ చేయటం కూడా జరిగిందని,బ్రహ్మానందం బల్క్ డేట్స్ కేటాయిస్తానని హామీ ఇచ్చాడని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.స్టార్ అయినా స్టార్ కమిడియన్ అయినా ఒకే రకంగా హిట్ కొట్టాలని రాజమౌళి ఇలాంట చిత్రాలకు తెర తీస్తున్నారు.తన చిత్రాల్లో హీరోనే ఉండాల్సిన పనిలేదని ఈగ తీస్తున్నారు.
ఇక ప్రస్తుతం బ్రహ్మానందం ప్రధానపాత్రలో చేసిన మనీ మనీ మోర్ మనీ చిత్రం ఈ నెల ఇరవై ఆరున విడుదల కానుంది.జెడీ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం కామిక్ ధ్రిల్లర్ గా రూపొందిందని చెప్తున్నారు.ఇది 'మనీ'కి రెండో సీక్వెల్ అనీ, అయితే ఇది కొత్త కథనీ చెప్పున్నాడు.ఇదివరకటి సినిమాల్లో నటించిన బ్రహ్మానందం, బ్రహ్మాజీ ఈ సినిమాలోనూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కేవలం స్క్రీన్‌ప్లే విషయంలోనే ఆ సినిమాలకు ఈ సినిమా సీక్వెల్. ఆ సినిమాల్లో నాలుగు పాత్రలను మాత్రమే ఈ సినిమాకోసం తీసుకున్నాను. మనీ మనీ ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడ్నుంచి ఈ సినిమా మొదలవ్వదు. ఎక్కడో మొదలై... ఎండ్ అవుతుంది. ఇదొక హ్యూమరస్ స్టోరీ అని చెప్పారు.


Click it and Unblock the Notifications











