రాజమౌళి నెక్ట్స్ ఆ హీరోతో!?

By Srikanya

మగధీర విజయోత్సాహంలో ఉన్న రాజమౌళి ప్రస్తుతం సునీల్ హీరోగా మర్యాద రామన్న అనే కామిడీని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఆ చిత్రం అనంతరం ప్రభాస్ హీరోగా చిత్రం చేయనున్నారని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాసే కన్ఫర్మ్ చేసారు. త్వరలో కె.రాఘవేంద్రరావు నిర్మాణంలో రాజమౌళి దర్శకత్వం వహించే సినిమా ఉంటుంది అని చెప్పారు. ఇక ఛత్రపతిగా ప్రభాస్ కి హిట్టిచ్చి నిలబెట్టిన రాజమౌళి ఈ సారి మరో యాక్షన్ ఎంటర్టైనర్ తో ముందుకు వస్తారని తెలుస్తోంది. ఇక ప్రభాస్ హీరోగా చేసిన ఏక్ నిరంజన్ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. అలాగే ప్రస్తుతం బీవీఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా కోసం ప్రభాస్ స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. కరుణాకరన్‌ దర్శకుడు. చక్కటి ప్రేమ కథ ఇది చెప్తున్నారు. డార్లింగ్ అనే టైటిల్ ని ఈ చిత్రానికి నిర్ణయించారు. దీని గురించి ప్రబాస్ చెబుతూ..ఈ చిత్రంలో నా నటనను మరో కోణంలో చూస్తారు. వేసవిలో వస్తుంది అన్నారు. అలాగే ఓ నెల రోజుల్లో ప్రభాస్ హీరోగా దిల్‌ రాజు నిర్మించే సినిమా మొదలవుతుంది. దశరథ్‌ దర్శకుడు. ఇదీ ప్రేమతో ముడిపడ్డ కుటుంబ కథే అని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X