»   » గొడవ ఎఫెక్ట్.... బాహుబలిపై రాజమౌళి నో కామెంట్

గొడవ ఎఫెక్ట్.... బాహుబలిపై రాజమౌళి నో కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల బాహుబలి సినిమా విడుదలకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమౌళి జర్నలిస్టులతో గొడవ పడ్డ సంగతి తెలిసిందే. పైరసీ విషయంలో పాత్రికేయుల వేసిన ప్రశ్నలతో విబేధించిన రాజమౌళి ఓ క్రమంలో సహనం కోల్పోయారు. అయితే అల్లు అరవింద్ కల్పించుకుని గొడవ సద్దుమనిగేలా చేసారు.

కాగా...నేడు బాహుబలి సినిమా విడుదలైన సందర్భంగా శుక్రవారం ఉదయం కూకట్‌పల్లిలోని సినిమా చూసేందుకు దర్శకుడు రాజమౌళి, నటి అనుష్క, బాహుబలి కాస్ట్యూమ్ డిజైనర్ రమారాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తదితరులు వచ్చారు. సినిమా చూసిన అనంతరం మీడియా ప్రతినిధులు రాజమౌళి ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించారు.


Rajamouli No comment on Baahubali

గత అనుభవం దృష్ట్యా మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన వారితో మాట్లాడేందుకు నిరాకరించారు. ఇపుడు నేనేమీ మాట్లాడను అంటూ అందరికీ నమస్కారం పెట్టి అక్కడి నుండి వెళ్లి పోయారు.


బాహుబలి సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో త్వరలోనే రాజమౌళి తన టీంతో కలిసి సక్సెస్ మీట్ పెట్టి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉంది.

English summary
After watching the Movie, Rajamouli No comment on Baahubali.
Please Wait while comments are loading...