‘S/O సత్యమూర్తి’పై రాజమౌళి అలా అన్నాడా?

By Bojja Kumar

హైదరాబాద్: ఏదైనా సినిమా నచ్చితే రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా కామెంట్స్ చేస్తుంటారు. కన్ని సినిమాలు ఆయన పాజిటివ్ కామెంట్స్ వల్ల ఎక్స్‌ట్రా కలెక్షన్లు అందుకున్నాయి. ఆ మధ్య సన్నాఫ్ సత్యమూర్తి థియోట్రికల్ ట్రైలర్ ని చూసిన రాజమౌళి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ రోజు సినిమా విడుదలై తర్వాత ఆయన తన సన్నిహితులతో నేను ఇప్పుడేమీ మాట్లాడను, నో కామెంట్ అని అన్నట్లు సమాచారం. ఇంతకీ రాజమౌళి సినిమా చూసారో? లేదో? ఒక వేళ చూసిన తర్వాతే తన అభిప్రాయం చెప్తానని ఇలా అన్నారో? తెలియాల్సి ఉంది. ఈ రోజు విడుదలైన ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం ఫ్యామిలీ ఎంటర్టెనర్ అనే పేరు తెచ్చుకున్నప్పటికీ కాస్త స్లోగా ఉందనే టాక్ వచ్చింది. అందుకే రాజమౌళి ‘నో కామెంట్' అని వ్యాఖ్యానించినట్లు చర్చించుకుంటున్నారు.

కాగా...సాధారణ ప్రేక్షకుల్లో మెజారిటీ వర్గాల నుండి సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ మరోసారి తన సత్తా చూపించాడని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలోని డైలాగులు అదుర్స్ అంటున్నారు. ఇక సినిమాకు హైలెట్ క్లైమాక్స్ అని అంటున్నారు.

Rajamouli No comment on S/O satyamurthy

అయితే సరైన ప్లేసింగ్ లేని సాంగులు సినిమా ఫ్లోను తగ్గించాయని అంటున్నారు. కానీ పాటల చిత్రీకరణ మాత్రం అద్భుతంగా ఉందని అంటున్నారు. సినిమా కథ చాలా బావుందనే అభిప్రాయం ఫ్యామిలీ ప్రేక్షకుల నుండి వినిపిస్తోంది. అయితే బన్నీని ఇప్పటి వరకు ఎనర్జిటిక్ గా చూసిన ప్రేక్షకులకు ఇందులోని స్లో స్క్రీన్ ప్లే అతనికి సెట్ కాలేదనే భావన కలుగింది. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా, డాన్సుల పరంగా బన్నీ అదరగొట్టాడు. దేవిశ్రీ తన సంగీతం ప్రేక్షకులను సంతృప్తి పరిచాడు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు నటించారు. సాంకేతిక వర్గం పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X