CNN-IBN అవార్డుకు నామినేటైన రాజమౌళి
హైదరాబాద్ : ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళి CNN-IBN ఇండియా-2012 అవార్డుకు నామినేట్ అయ్యారు. ప్రతి సంవత్సరం CNN-IBN వివిధ కేటగిరీల్లో అవార్డులు ప్రధానం చేస్తారు. ఎంటర్ టైన్మెంట్ రంగంలో సౌతిండియా నుంచి కేవలం రాజమౌళి మాత్రమే నామినేట్ అయ్యారు.
ఈగ చిత్రానికి గాను రాజమౌళి నామినేట్ అయ్యే అవకాశం దక్కింది. ఈ కేటగిరిలో ఇంకా అమీర్ ఖాన్ అండ్ సత్యమేవ జయతే టీం, ఇర్ఫాన్ ఖాన్, రణబీర్ కపూర్, శ్రీదేవి, విద్యా బాలన్ కూడా నామినేట్ అయ్యారు. త్వరలో వీరిలో ఎవరో ఒకరికి అవార్డు దక్కనుంది. వినోదంతో పాటు వివిధ రంగాల్లో ప్రతి సంవత్సరం CNN-IBN ఈ అవార్డులు అందజేస్తోంది.
రాజమౌళి సినిమాల విషయానికొస్త..
ఇటీవలే 'ఈగ' చిత్రంతో హిట్ కొట్టిన రాజమౌళి...తర్వాత ప్రభాస్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్, భారీ తారాగణం, భారీ హంగుళతో రూపొందుతున్న ఈచిత్రం తెలుగు సినిమా చరిత్రలో గొప్ప చిత్రంగా తీర్చిద్దేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












