Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజమౌళి, ఎన్టీఆర్ సాన్నిహిత్యాన్ని తెలిపే అరుదైన పిక్.. నెట్టింట వైరల్
తెనుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది దర్శకులతో ఎన్టీఆర్‌కి మంచి రిలేషన్ షిప్ ఉంది. కానీ దర్శక ధీరుడు రాజమౌళితో ఆయనకున్న రిలేషన్ మాత్రం చాలా చాలా ప్రత్యేకమైంది. అయితే ఈ ఇద్దరి మధ్యనున్న సాన్నిహిత్యం తెలిపేలా ప్రస్తుతం ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇరువురి అభిమానులకు ఈ పిక్ కన్నుల పండుగగా ఉంది. చెట్టాపట్టాలేసుకున్న జక్కన్న, ఎన్టీఆర్‌లను చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.
ఆరంభంలోనే అదుర్స్
కెరీర్ ప్రారంభంలోనే ఇద్దరు కలిసి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో సంచలనం సృష్టించారు. ఆ తరువాత సింహాద్రి వీరిరువురికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత యమదొంగ రూపంలో ఓ వైవిధ్యభరితమైన కథను ప్రేక్షకుల ముందుంచి సూపర్ హిట్ జోడీగా పేరుతెచ్చుకున్నారు రాజమౌళి, ఎన్టీఆర్. ఇప్పటి వరకు రాజమౌళి 11 చిత్రాలను డైరెక్ట్ చేస్తే అందులో మూడు చిత్రాలను ఎన్టీఆర్తోనే చేయడమంటే ఈ ఇద్దరి బాండింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
తమ మధ్య రిలేషన్ ఎలాంటిదో తెలిపేలా
అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు (మే 20) సందర్బంగా తమ మధ్య రిలేషన్ ఎలాంటిదో తెలిపేలా ఓ ఫోటో జోడించి ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు రాజమౌళి. ఈ పిక్ చూస్తే ఒక్కమాటలో చెప్పేయొచ్చు.. ఒకరంటే ఒకరికి వారి వారి హృదయాల్లో ఎంత ప్రత్యేకమైన స్థానాలున్నాయో. ఇప్పటికే చాలా వేదికలపై వీరిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత, వృతిపరమైన అనుబంధం వ్యక్తమైనప్పటికీ ఈ పిక్ మాత్రం వెరీ స్పెషల్ అంటున్నారు నందమూరి అభిమానులు. రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి సందర్భంగా వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు తీసిన ఫోటోనే ఇది.
ఎన్టీఆర్, రాజమౌళి సక్సెస్ఫుల్ కాంబోలో
ప్రస్తుతం ఎన్టీఆర్, రాజమౌళి సక్సెస్ఫుల్ కాంబోలో నాలుగో సినిమాగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోంది. డీవీవీ దానయ్య సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో తారక్‌తో పాటు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్గా కన్ఫర్మ్ కాగా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా..
నిన్న మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఎన్టీఆర్ హాఫ్ షేడ్ పిక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ పిక్ ద్వారా ఆర్ఆర్ఆర్ యూనిట్ సభ్యులంతా ఎన్టీఆర్ కి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇక 1920 బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేయనున్నారు.