రాజమౌళి- ఎన్టీఆర్‌ల మరో సంచలన చిత్రం
గతంలో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్‌లో మరో సినిమా రూపుదిద్దుకోబోతోంది. మాస్ మసాలా చిత్రాలను రూపొందించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న రాజమౌళి తన సొంత బ్యానర్‌పై ఎన్టీఆర్‌తో సినిమా తీయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, తన తదుపరి సినిమా ఇదేనని రాజమౌళి చెప్పారు. ఆయన తదుపరి చిత్రం మహేష్‌బాబుతో ఉంటుంద ని వార్తలు వచ్చినప్పటికీ మొదట ఎన్టీఆర్‌తోనే ఆయన సినిమా తీయనున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో పూరీ జగన్నాధ్, రాజమౌళి హవా నడుస్తోంది. వీరిద్దరి దర్శకత్వంలో నటించాలని పెద్ద హీరోలు ఉవ్విళ్ళూరుతున్నారు.


Click it and Unblock the Notifications