twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బహుబలి-2’ క్లైమాక్స్ మీద ఫోకస్ పెట్టిన రాజమౌళి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దాదాపు నెల రోజుల బ్రేక్ అనంతరం దర్శకుడు రాజమౌళి మళ్లీ 'బాహుబలి-2' ప్రాజెక్టు పనుల్లో మునిగి పోయారు. షూటింగుకు బ్రేక్ ఇవ్వడంతో రాజమౌళి ఆస్ట్రేలియా, మరికొన్ని ప్రదేశాలు వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే.

    వెకేషన్ పూర్తయిన తర్వాత రాజమౌళి మళ్లీ తన ప్రాజెక్టు పనుల్లో బిజీ అయ్యారు. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం రాజమౌళి ఇటీవలే విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ కనల్ కన్నన్, విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ తో సమావేశమై సినిమా క్లైమాక్స్ షూటింగ్ గురించి చర్చించినట్లు సమాచారం.

    Rajamouli on Baahubali 2 Climax talks

    క్లైమాక్స్ మినహా సినిమాకు సంబంధించిన ఇతర షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. క్లైమాక్స్ షూటింగ్ కూడా పూర్తయితే విజువల్ ఎఫెక్ట్ష్ పనులు మొదలు కానున్నాయి. ప్రస్తుతం షూటింగుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి.

    మరో వైపు విషయంలో రాజమౌళి కొత్త టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టారు. ప్రపంచ సినిమా కనుక్కున్న సరికొత్త శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌)తో ఈ సినిమా జతగట్టబోతోంది. 'బాహుబలి' దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు.

    'బాహుబలి: ది కంక్లూజన్‌'తోపాటు...అదే సమయంలో వీఆర్‌ వెర్షన్‌ 'బాహుబలి'ని కూడా సిద్ధం చేస్తున్నారు. కేన్స్‌ చలనచిత్రోత్సవంలో ఓ బాలీవుడ్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు రాజమౌళి.

    రాజమౌళి మాట్లాడుతూ... 'బాహుబలి: ది కంక్లూజన్‌' పనులు శరవేగంగా జరగుతున్నాయి. మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు సరికొత్త విధానంలో ఇంకో 'బాహుబలి'ని అందించబోతున్నాం. వర్చువల్‌ రియాలిటీ ద్వారా 'బాహుబలి'ని ప్రేక్షకులకు కొత్తగా చూపించబోతున్నాం అని చెప్పారు.

    English summary
    Already Rajamouli started consultations with VFX guys and VFX producer Kanal Kannan to discuss about the 'climax' shooting of the film. Barring the climax portion, the whole of the shoot is already finished and Visual Effects are going on at brisk pace.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X