»   » బాహుబలి :రాజమౌళి నెక్స్ట్ విడుదల చేసే పోస్టర్ ఇదే

బాహుబలి :రాజమౌళి నెక్స్ట్ విడుదల చేసే పోస్టర్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి తన తాజా చిత్రం బాహుబలికి సంభందించి ఫస్ట్ లుక్ పోస్టర్ ల రిలీజ్ లతోనే సినిమాకు ఎనలేని క్రేజ్ ని సంతరించుకున్తున్న సంగతి తెలిసిందే. . సినిమాలో పాత్రలన్నిటినీ ఒక్కొక్కటిగా పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఆయన మరో పోస్టర్ ని విడుదల చేయటానికి రంగం సిద్దం చేస్తున్నారు. తరువాత విడుదల చేసే పాత్ర పేరు ట్విట్టర్ లో తెలిపాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


తెలుగులో బిజ్జాలదేవ, తమిళంలో పింగళతేవన్ పేరుతొ తదుపరి పాత్ర వుండనుంది. అయితే ఈ పాత్రను ఎవరు పోషించారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఆర్కా మీడియా సంస్థ ద్వారా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శకుడు. తాజాగా విడుదల చేసిన ప్రభాకర్(కాళకేయ) పోస్టర్ మంచి స్పందనని సంతరించుకున్న సంగతి తెలిసిందే.


Rajamouli on Bahubali's next poster

‘బాహుబలి' చిత్రం భారీ బడ్జెట్‌తో ఈ వేసవిలో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో విడుదలకు సైతం భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. ముఖ్యంగా ఈ ఆడియో నిమిత్తం కోటి రూపాయలు దాకా ఖర్చు పెట్టాలని నిర్మాతలు ప్రిపేర్ అయ్యారని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఆడియో హక్కులు కోసం...పెద్ద పెద్ద ఆడియో కంపెనీలు చాలా ఖర్చు పెట్టి సొంతం చేసుకునేందుకు ముందుకు వస్తున్నాయని సమాచారం. అలాగే ఈ ఆడియోకు తమిళం నుంచి రజనీకాంత్, హిందీ నుంచి అక్షయకుమార్, తెలుగు నుంచి రాజమౌళి ఇప్పటిదాకా చేసిన హీరోలు హాజరు కానున్నారని సమాచారం.


ఇక కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియోని మే 31 న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అదే రోజు చిత్రం ట్రైలర్ ని సైతం వదులుతారు. ఈ నేఫద్యంలో రాజమౌళి ప్రమోషన్ పనులును వేగవంతం చేసి రోజుకో రెండు రోజులకో పోస్టర్ చొప్పిన వదిలి సినిమాపై క్రేజ్ ని పెంచుతున్నారు. ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతోఅయితే ఈ విషయమై నిర్మాతలు తేదీ ఖరారు చేస్తూ ప్రకటన ఇంకా విడుదల చేయలేదు.


Rajamouli on Bahubali's next poster

మరో ప్రక్క పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం బిజినెస్‌ కూడా భారీ స్థాయిలోనే జరుగుతోంది. తెలుగు నాట ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్‌ హక్కులు కూడా అమ్ముడయిపోయాయి. ప్రభాస్‌తో ‘మిర్చి', శర్వానంద్‌తో ‘రన్‌ రాజా రన్‌' చిత్రాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్‌ సంస్థ తమిళనాడుకు చెందిన స్డూడియో గ్రీన్‌ సంస్థతో కలిసి ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఈ తమిళ వెర్షన్‌ హక్కులు సుమారు రూ.25 కోట్లు పలికినట్లు కోలీవుడ్‌ సమాచారం.


‘బాహుబలి' చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. వంద సెకండ్ల నిడివిగల ట్రైలర్‌ను చూపించే విధంగా ఎడిట్‌ చేస్తున్నారని ఫిలింనగర్‌ సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక భారీ వ్యయంతో రూపొందిస్తున్న బాహుబలి చిత్రానికి సంబంధించిన ఐదవ పోస్టర్‌ను దర్శకుడు రాజవౌళి సామాజిక మాధ్యమంలో సోమవారం పోస్ట్ చేశారు.


నటుడు ప్రభాకర్ కాళకేయగా నటించిన సన్నివేశంతో కొత్త పోస్టర్ వచ్చింది. ఇప్పటివరకు నాలుగు పోస్టర్‌లను విడుదల చేసి సంచలనం సృష్టించిన రాజవౌళి బాహుబలి చిత్రం కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. చిత్రం విడుదల ఆలస్యం అవుతూండటంతో రోజుకో పోస్టర్‌ను విడుదల చేస్తూ రాజవౌళి వినూత్న ప్రచారానికి తెరదీశారు.

English summary
Rajamouli tweeted "Thanks everyone for the amazing response. Next poster will be of " Bijjala Deva" ." Keeravani is the music director for the film produced on Arka Media Works. Prabhas will be seen as Bahubali and Shivjudu, Anushka as Devasena, Rana as Bhallala Deva, Tamanna as Avantika. Film also stars Sudeep,Satyaraj,Nassar,Ramya Krishna, Adivi Sesh, Tanikella Bharani, Charandeep and Baba Sehgal in important roles. Nora Fatehi is doing special song in the film.
Please Wait while comments are loading...