కులం మ్యాటర్ పై రాజమౌళి స్పందన
ప్రముఖ దర్శకుడు రాజమౌళి రీసెంట్ గా ట్విట్టర్ లో ఓ అభిమాని క్యాస్ట్ విషయమై అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అ అభిమాని...అందరు హీరోలు కలిసి ఒక త్రాటిపైన నిలబడి పరిశ్రమలోని కుల వివక్షతకు చెక్ పెట్టచ్చు కదా అని అడిగారు. దానికాయన...అలాంటి ప్రయత్నాలు చాలా సార్లు మన హీరోలు చేసారు. కానీ దురదృష్టమేమిటంటే..కులం అనేది జనాల ఆలోచనల్లో ఇంకిపోయింది అన్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి ఈగ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ప్రారంభం రోజు నుంచి ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. అపజయం ఎరగని రాజమౌళి చిత్రం కావటం, కొత్త కాన్సెప్టు తో ఈ చిత్రం రూపొందటం,పిల్లలు పెద్దలు తేడా లేకుండా చూడగలిగే కథ కావటం సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
ఈ చిత్రంలో నాని సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. ఇక 'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం. ఈ చిత్ర అనంతరం రాజమౌళి ..ప్రభాస్ కాంబినేషన్ లో చిత్రం మొదలవుతుంది.


Click it and Unblock the Notifications











