ఇలాంటోడు నా ఫస్ట్ సినిమా హీరోనా.. తెగ బాధపడిపోయా... ఎన్టీఆర్‌పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్
దర్శకధీరుడు రాజమౌళి-యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరూ ఒకే సమయంలో కెరీర్‌ను ప్రారంభించడం, ఎన్టీఆర్ రెండో సినిమా, రాజమౌళికి మొదటి సినిమా కావడంతో వారిద్దరి మధ్య బంధం ఏర్పడింది. అయితే నాటి సంగతులను గురించి వివరిస్తూ రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్‌ను చూసిన క్షణం ఏమని అనుకున్నారో, తరువాత ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో వివరించాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన రాజమౌళి.. అనేక విషయాలను వెళ్లడించాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

తదుపరి ప్రాజెక్ట్ ఫిక్స్..
దర్శకధీరుడు రాజమౌళి ఎప్పుడూ కూడా ప్రస్తుతం చేసే ప్రాజెక్ట్ మీదే దృష్టి పెడుతూ ఉంటాడు. ఎప్పుడూ కూడా పక్క చూపులు చూడడు. ఓ సినిమా పూర్తయ్యాకే మరో ప్రాజెక్ట్ వివరాలను ప్రకటిస్తాడు. అయితే మొదటి సారిగా ఆర్ఆర్ఆర్ సెట్స్ మీద ఉండగానే.. మహేష్ బాబుతో తన తదుపరి ప్రాజెక్ట్ అని ప్రకటించేశాడు. కేఎల్ నారాయణ నిర్మాణంలో అది ఉండబోతోందని తెలిపాడు.

ఇంటి వద్ద నుంచే పనులు..
ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అయితే ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన పనులను మాత్రం ఇంటి వద్ద ఉండే సమీక్షిస్తున్నట్టు తెలిపాడు. గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోందని వివరించాడు. అంతా ఇంటి పట్టునే ఉంటూ ఆర్ఆర్ఆర్ పనులను చేస్తున్నామని తెలిపాడు.

ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ కష్టమే..
రామ్ చరణ్ పుట్టినరోజుకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఎన్టీఆర్ బర్త్ డేకు ఇవ్వలేకపోవచ్చని తెలిపాడు. ఎందుకంటే లాక్ డౌన్‌కు ముందే రామ్ చరణ్‌కు గిఫ్ట్ రెడీ అయిందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్‌కు సర్ ప్రైజ్ ఇవ్వలేకపోవచ్చనే సందేహాన్ని వ్యక్తం చేశాడు. దీన్ని బట్టి చూస్తే భీమ్ కోసం రామరాజు రావడం ఆలస్యం అవుతుంది.

ఇలాంటోడా నా ఫస్ట్ హీరో..
స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు ఎన్టీఆర్ హీరోగా అని చెప్పినప్పుడు, అతడ్ని చూసినప్పుడు ఆయన వయసు 19 ఉంటుందేమో, మీసాలు కూడా పూర్తిగా రాలేదు.. నూనుగు మీసాలున్నాయని గుర్తు చేసుకున్నాడు. చాలా లావుగా ఉన్నాడు.. ఇలాంటోడు నా హీరోనా అని ఫీలయ్యానని తెలిపాడు. అయితే ఇంట్రవెల్ సీన్ షూటింగ్ జరిగాక, ఆయన పర్ఫామెన్స్ చూశాక తన తప్పు తెలిసిందని చెప్పుకొచ్చాడు.
Recommended Video

తెగ బాధపడిపోయా..
ఆ సీన్‌లో నటించిన ఎన్టీఆర్‌ను చూశాక.. ఆయన్ను ఎలా చూడాలో అర్థమైందని తెలిపాడు. అప్పటి వరకు ఆయను చూసిన తీరుకు బాధపడ్డాడని తెలిపాడు. ఆయనలో ఏదో ఉందని, అందర్నీ ఆకట్టుకునేంత ప్రతిభ, నటన ఉన్నాయని అర్థమైందని ఎన్టీఆర్ గురించి వివరించాడు.


Click it and Unblock the Notifications











