పవన్ కళ్యాణ్‌ని ఇంప్రెస్ చేసిన రాజమౌళి!
అపజయం అంటూ ఎరుగని రాజమౌళి ఈగ చిత్రంతో తన రేంజి మరింత పెంచుకున్నాడు. ఈ దర్శకుడు త్వరలో పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయబోతున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాజమౌళి పవన్ కళ్యాణ్‌ని కలిశాడని, పవన్‌కి పవన్ కోసం తాను తయారు చేసిన కథ చెప్పారని...రాజమౌళి చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన పవన్ ఓకే చెప్పారని తెలుస్తోంది. అయితే ఈ విషయం అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ కావాల్సి ఉంది.
సంవత్సరానికి పైగా చాలా కష్ట పడి ఈగ చిత్రాన్ని రూపొందించిన రాజమౌళి...కష్టానికి తగిన ఫలితం పొందారు. విడుదలైన తొలి రోజే ఈచిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజమౌళి తర్వాత చేయబోయే సినిమా ఏమిటి? ఎవరి తో తీస్తారు అనే విషయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ప్రభాష్, జూ ఎన్టీఆర్ క్యూలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పవన్‌తో సినిమా తీసేది ఎప్పుడో? అనే సందేహాలు ఉన్నారు.
గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టడంతో బడా నిర్మాతలంతా పవన్‌తో సినిమా చేసేందుకు పోటీ పడుతున్నారు. పవన్-రాజమౌళి సినిమా రాబోతోందని చాలా కాలం క్రితమే ఊహాగానాలు మొదలవ్వడంతో దాన్ని దక్కించుకోవడానికి ఇటు పవన్ వద్ద, అటు రాజమౌళి వద్ద తమ తమ ప్రయ్నాలు చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. ప్రస్తుతం వాళ్లకి ఉన్న మార్కెట్ రేటుకంటే రెమ్యూనరేషన్ ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా కొందరు వెనుకాడటం లేదు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. మణిశర్మ సంగీతం అదిస్తుండగా డివివి దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











