ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్: ఆర్ఆర్ఆర్ నుంచి సర్‌ప్రైజ్!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. డీవీవీ దానయ్య సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అత్యంత భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఆలియా భట్ ఓ హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది. మరో హీరోయిన్ కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇంకా ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సముద్రఖని లాంటి భారీ తారాగణం పాలు పంచుకుంటోంది. చిత్రానికి 400 కోట్ల మేర బడ్జెట్ కేటాయించడం విశేషం.

నటీనటుల వివరాలు తప్ప ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎటువంటి అప్‌డేట్ బయటకు రాలేదు. ఆర్ఆర్ఆర్ టైటిల్ అర్థం ఏంటనేది కూడా చిత్రయూనిట్ వెల్లడించలేదు. అయితే మరో రెండు రోజుల్లో అనగా మే 20 వ తేదీన ఎన్టీఆర్ బర్త్ డే పురస్కరించుకొని రాజమౌళి ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. తండ్రి హరికృష్ణ మరణించి ఏడాది కూడా పూర్తికాని కారణంగా ఈ ఏడాది తన బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసుకోనని, అలాగే ఫ్యాన్స్ కూడా ఎలాంటి ఆర్భాటాలు చేయరాదని కోరుతున్నారు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ పాత్ర ప్రీ లుక్ విడుదల చేయాలని జక్కన్న ప్లాన్ చేశారట.

Rajamouli plans birth day gift for ntr

ఆర్ఆర్ఆర్‌కి సంబంధించి ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసిన జక్కన్న.. తాజాగా మరో షెడ్యూల్ షూటింగ్ షూటింగ్ కోసం రెడీ అయ్యారు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన ఓ సెట్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తున్నారు. చెర్రీ సరసన ఆలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ ఫైనల్ కావాల్సి ఉంది. వచ్చే ఏడాది జులై నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Read more about: rrr ram charan rajamouli shooting
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X