అమీర్ ఖాన్‌తో సినిమా ప్లాన్ చేస్తున్న జక్కన్న

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్‌తో భవిష్యత్తులో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి. ఇటీవల ఓ పత్రిక ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

అయితే అమీర్‌ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్‌హీరాని సినిమాలంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో అమీర్‌ఖాన్ హీరోగా సినిమా చేయాలనే ఆలోచన వుంది. అందుకు ఆయన అంగీకరిస్తాడని ఆశిస్తున్నాను అని చెప్పారు రాజమౌళి. గతంలో ఓ సారి రాజమౌళి అమీర్ ఖాన్‌ను కలిసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి' చిత్రం తెరకెక్కిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీతో విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట.

Rajamouli plans film with Aamir Khan

భారీ బడ్జెట్, భారీ తారాగణం, భారీ సెట్టింగులు ఇలా...అన్నింటిలోనూ భారీ తనం ప్రదర్శిస్తున్న ‘బాహుబలి' చిత్రంలో మరో భారీ ప్రత్యేక కూడా ఉంది. ఈ చిత్రం షూటింగ్ కోసం 100 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సినిమాలో ఈ విగ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. అందు వల్లే ఎంతో శ్రమించి ఈ విగ్రహాన్ని షూటింగు కోసం రెడీ చేసారు.

ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే తలిసారి. ఈ విగ్రహం బరువు పదుల టన్నుల్లో ఉంటుందని అంచనా. ప్రస్తుతం బాహుబలి చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రభాస్, అనుష్క, ఇతర ముఖ్య తారాగణంపై పాత్రల చిత్రీకరణ జరుగుతోంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ 2015లో ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X