యుఎస్‌లో ‘ఈగ’ జోరు, ఓపెనింగ్స్ అదిరాయన్న రాజమౌళి
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రం ఇండియాతో పాటు అమెరికాలోనూ తన జోరు కొనసాగిస్తోంది. విడుదైన రోజు నుంచి ఈ చిత్రం అమెరికాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈగ దెబ్బకు బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'బోల్ బచ్చన్' కలెక్షన్ల విషయంలో వెనకపడి పోయిందంటే విషయం అర్థం చేసుకోవచ్చు. 'ఈగ' చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌కు ప్రస్తుతం విడుదలైన థియేటర్ల సరిపోక పోవడంతో మరిన్ని పెంచాలని నిర్ణయించారు.
యూఎస్ బాక్సాఫీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం అక్కడ 'ఈగ' తెలుగు వెర్షన్ 31 థియేటర్లలో, తమిళ వర్షన్ 'నాన్ ఈ' 8 స్క్రీన్లలో విడుదలైంది. ఇందులో కొన్ని డైలీ ఒక షో మాత్రమే వేస్తున్నారు. కొన్ని సిటీల్లో అసలు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేదు. దీంతో ఈగ రెస్సాన్స్‌ను సరిగా క్యాష్ చేసుకోలేకపోతున్నామని డిస్సప్పాయింట్‌లో ఉన్న నిర్మాతలు, డిస్ట్రబ్యూటర్లు థియేటర్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఈగ చిత్రం సక్సెస్ టూర్ జరుగుతోంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుంటూరు అన్ని ముఖ్య పట్టణాలను తాకుతూ సాగుతోంది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ....ఈగ చిత్రానికి ఇంతలా భారీ ఓపెనింగ్స్ వస్తాయని అస్సలు ఊహించలేదని, స్టార్ హీరోల లెవల్లో ఈ చిత్రానికి స్పందన రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్టు, స్క్రిప్టు సక్సెస్ రేంజిని పెంచడానికి మాత్రమే ఉపయోగపడతాయి. సినిమా హిట్ కావాలంటే కథబలమే ముఖ్యమని ఓ ప్రశకు ఆయన సమాధానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











