ఆర్ఆర్ఆర్: కోల్‌కతాలో కలుసుకోబోతున్న ఎన్టీఆర్-రామ్ చరణ్
ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్‌గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ షూటింగ్ శరవేగంగా, గ్యాప్ లేకుండా జరుగుతోంది. ఇప్పటి వరకు 3 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. తర్వాతి షెడ్యూల్ కోల్‌కతాలో ప్లాన్ చేశారు. కోల్‌కతాలో దాదాపు 40 రోజుల లాంగ్ షెడ్యూల్ ఉంటుందని సమాచారం.
మొదటి షెడ్యూల్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ మీద యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. తర్వాత జరిగిన రెండు షెడ్యూల్స్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ మీద వేర్వేరుగా సీన్ల చిత్రీకరణ జరిపారు. ఇందులో ఎక్కువగా ఫైటింగ్ సీన్లే రూపొందించినట్లు తెలుస్తోంది.

కోల్‍కతాలో ఇద్దరిపై సీన్లు
అయితే కోల్‌కతాలో జరిగే లాంగ్ షెడ్యూల్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నారట. ఇక్కడ టాకీ పార్ట్ చిత్రీకరణ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. చిత్ర బృందం కోల్‌కతా వెళ్లే ముందే హీరోయిన్లను ఫైనల్ చేసే అవకాశం ఉందట.

ఆర్ఆర్ఆర్ మీద రూమర్స్
‘ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టుకు సంబంధించి ఏ చిన్న క్లూ కూడా బయటకు రాకుండా రాజమౌళి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సినిమా కాన్సెప్టు ఏమిటి? రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే వివరాలు కూడా ఇంకా బయటకు రాలేదు. దీంతో రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి.

బందిపోటుగా ఎన్టీఆర్
ఈ చిత్రంలో ఎన్టీఆర్ బందిపోటుగా కనిపించబోతున్నాడని, రామ్ చరణ్ పోలీస్ పాత్రలో కనిపిస్తారని, బ్రిటిష్ కాలం నాటి కథతో ఈ చిత్రం సాగుతుందని ఇలా రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రాజమౌళి మాత్రం ఈ విషయంలో స్పందించడం లేదు.

సమయం వచ్చినపుడు అన్నీ చెబుతానన్న రాజమౌళి
ఆర్ఆర్ఆర్ గురించి ఏ విషయం కూడా బయటకు రాలేదు. మా కోసం ఏమైనా చెప్పండి...అని మీడియా వారు ఇటీవల హార్వర్డ్ ప్రెస్ మీట్లో అడగ్గా రాజమౌళి నిరాకరించారు. ఒక్కో సినిమా విషయంలో ఒక్కో విధానం ఉంటుంది. బాహుబలి స్టోరీ నేను ముందే ఏమీ చెప్పలేదు. మర్యాద రామన్న, ఈగ చిత్రాలకు కథ ముందే చెప్పాను. ఆర్ఆర్ఆర్ గురించి అన్ని విషయాలు దాయాలని ఏమీ కాదు, సీక్రెట్ గా పెట్టాలని ఏమీ కాదు. ఇది సరైన సమయం కాదు. ఆ సమయం వచ్చినపుడు దాని గురించి అన్ని విషయాలు చెబుతానన్నారు.


Click it and Unblock the Notifications











