బాహుబలిలో రాజమౌళి కీలకపాత్ర.... కొత్తలుక్ (ఫోటో)
హైదరాబాద్ : దర్శకుడు రాజమౌళి తొలిసారిగా వెండితెరపై కనిపించబోతున్నారా? తన దర్శకత్వం వస్తున్న 'బాహుబలి' చిత్రంలో కీలక పాత్ర పోషించేందుకు రెడీ అయ్యారా? అంటే అంటే అవుననే అంటోంది ఆయనకు సంబంధించిన ఓ ఫోటో. ఆ పాత్ర కోసం మీసాలు బాగా పెంచేసి వెరైటీ లుక్ ట్రై చేస్తున్నారట. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో రాజమౌళి కొత్త లుక్‌ను చూడొచ్చు.
రాజమౌళి కేవలం దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప నటుడు అని ఆయనతో పని చేసిన పలువు స్టార్స్ ఇప్పటికే చాలా సందర్భాల్లో వెల్డడించారు. ఏ సన్నివేశాన్నయినా రాజమౌళి తొలుత నటించి చూపిస్తాడు. రాజమౌళి చేసినట్లు హీరోలు మనకు చేసి చూపిస్తారంతే...
ఆ మధ్య 'ఈగ' సినిమా షూటింగులో రాజమౌళి నటించిన చూపించిన కొన్ని క్లిప్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈగ ఆడియో ఫంక్షన్లో హీరో నాని మాట్లాడుతూ...రాజమౌళి గొప్ప నటుడు, ఆయన చేసినదాంట్లో మేము సగం చేసినా సరే గొప్పగా సీన్ పండుతుంది అంటూ కితాబిచ్చాడు. మరి తొలిసారిగా వెండితెరపై కనిపించబోతున్న రాజమౌళి ప్రేక్షకులనే ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.
'బాహుబలి' అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని తెలుస్తోంది. ఈ చిత్రానికి 'మహాబలి' అనే టైటిల్ ఖరారు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆర్కా మీడియా సంస్థ కూడా ఫిల్మ్ చాంబర్లో 'మహాబలి' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు.
ఈ చిత్రంలో ప్రభాస్ రాజ్ పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రియురాలు సంయోగిత పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











