»   » ‘బాహుబలి-2’ మరో ఏడాది ఆలస్యం... ఎందుకు?

‘బాహుబలి-2’ మరో ఏడాది ఆలస్యం... ఎందుకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి-ది బిగినింగ్' ఎంత పెద్ద విజయం సాధించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు, హిందీ, తమిళం, మళయాలం ఇలా విడుదలైన అన్ని భాషల్లోనూ ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం..... ప్రతి ఒక్కరిలోనూ బాహుబలి పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూసేలా చేసింది.

2016లో బాహుబలి-2 విడుదలవుతుందని గతంలో ప్రకటించినప్పటికీ... మరో ఏడాది ఆలస్యంగా, అంటే 2017లో సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. సినిమా కథలో మరిన్ని మార్పులు చేసి, ముందుగా అనుకున్న దాని కంటే మరింత బెటర్ గా తీయాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి అండ్ టీం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచరాం.

Rajamouli postpones Baahubali-2 release to 2017

వాస్తవానికి బాహుబలి సినిమా ఇంత భారీ విజయం సాధిస్తుందని రాజమౌళి కూడా ఊహించలేదు. మరో వైపు ‘బాహుబలి' విదేశీ బాషల్లోనూ అదరగొడుతోంది. అందుకే మరిన్ని మార్పులు చేసి ఇటు ఇండియన్, అటు ఇంటర్నేషనల్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

రచయిత విజయేంద్రప్రసాద్ మరికొందరితో కలిసి ‘బాహుబలి-2' కథను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నారని సమాచారం. బాహుబలి 2 షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయినా....కథ మార్పు నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

English summary
SS Rajamouli's epic movie Baahubali-2 will be released in 2017 after completion of shooting in 2016. Earlier, Rajamouli planned to release the movie in 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu