‘గుండె జారి గల్లంతయ్యిందే’ గురించి రాజమౌళి ట్వీట్

రాజమౌళి ట్వీట్ లో... మేము ఇరవై మందిమి గుండె జారి చిత్రం చూసాము. అందరం బాగా ఎంజాయ్ చేసాం. ముఖ్యంగా నితిన్ తన బలాలని తెలుసుకున్నందుకు ఎప్రిషియేట్ చేయాలి. మాలాంటి వాళ్ళం చెయ్యలేకపోయాం. ఇక నిత్యామీనన్ ఆమె ఫెరఫార్మెన్స్ చాలా బాగుంది. గ్రేట్ యాక్టింగ్. డైరక్డర్ విజయ్ కుమార్ ఫెంటాస్టిక్ జాబ్ చేసారు. అతనికి అతని టీమ్ కు అందికీ కంగ్రాట్స్ అన్నారు.
కథలో ....తెలివైన కుర్రాడు కార్తీక్ (నితిన్). సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అమ్మానాన్నలు మాత్రం అమెరికాలో ఉంటారు. తొలి చూపులో పుట్టేదే ప్రేమ అనేది అతని నమ్మకం. ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురు శ్రావణి (నిత్య మీనన్). సున్నిత మనస్తత్వమున్న యువతి. తన కోసమే పుట్టిన యువకుడిని పెళ్లి చేసుకోవాలనేదే ఆమె ఆలోచన. ప్రతి విషయంలోనూ నిక్కచ్చిగా నడుచుకొనే మరో యువతి శ్రుతి (ఇషా తల్వార్). కార్తీక్, శ్రావణి, శ్రుతిల మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? కార్తీక్ ఎవరితో కలిసి జీవితం పంచుకొన్నాడు? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.
నిర్మాత మాట్లాడుతూ-''ఇష్క్..హిట్ తర్వాత మా బేనర్‌నుంచి వచ్చిన చక్కని కుటుంబ కథాచిత్రమిది. హీరో,హీరోయిన్స్ కెమిస్ట్రీ ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వసూళ్ల పరంగా టాప్‌లో నిలబెడుతోంది. గుత్తా జ్వాల చేసిన సాంగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పాటలు కి విశేష స్పందన వచ్చింది. తొలిప్రేమ'లోని పవన్‌కళ్యాణ్ పాట కోసం నితిన్ చాలా ఎఫర్ట్ పెట్ట పనిచేశారు. ఆ పాటకి చక్కని స్పందన వస్తోంది'' అన్నారు.


Click it and Unblock the Notifications











