సినిమా...అదిరిపోయిందంటూ రాజమౌళి ట్వీట్

By Srikanya

హైదరాబాద్ : మొన్న శుక్రవారం( జూన్ 7)న విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం 'ప్రేమకథా చిత్రమ్‌'. ఈ రో జుల్లో, బస్‌స్టాప్‌ సక్సెస్‌ల తర్వాత మారు తి స్వీయ దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కించిన ఈ చిత్రం చూసి రాజమౌళి ప్రసంశలు వర్షం కురిపించారు.

రాజమౌళి ట్వీట్ చేస్తూ... " 'ప్రేమకథా చిత్రమ్‌' సినిమాకు వెళ్లాను. చాలా బాగా ఎంజాయ్ చేసాను. కేవలం 1.8 కోట్ల బడ్జెట్ లో తీసారని విన్నాను. చాలా పెద్ద విజయం సాధించింది. కంగ్రాట్యులేషన్స్ !!"

'ప్రేమకథా చిత్రమ్‌'. సుధీర్‌బా బు-నందిత హీరో,హీరోయిన్స్ గా ఆర్‌.పి.ఏ క్రియేష న్స్‌-మారుతి టాకీస్‌ సంయుక్తంగా నిర్మిం చాయి. సుదర్శ నరెడ్డి నిర్మాత. ఈరోజు ల్లో' ఛాయాగ్రాహకుడు జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వం వహించారు.

మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో, జె ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సినీ విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందడంతో పాటు, పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో తొలిరోజైన శుక్రవారం ఈ చిత్రం ఓవరాల్‌గా రూ. 3.14 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ టాక్.

శనివారం ఈ చిత్రం కలెక్షన్స్ రూ. 2.90 కోట్లు రాగా, ఆదివారం మరో రూ. 2.58 కోట్లు వసూలు చేసింది. తొలి వీకెండ్ మూడు రోజుల్లో ఈచిత్రం మొత్తం రూ. 6.05 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కేవలం రూ. 2 కోట్లలోపు బడ్జెట్‌తోనే ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ కలెక్షన్స్ భారీగా రావడం, కలెక్షన్స్ మరింతగా వచ్చే అవకాశాలు బాగా ఉండటంతో నిర్మాత జాక్ పాట్ కొట్టినట్లయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X