గొప్పగా తీసారంటూ రాజమౌళి ప్రశంసలు
హైదరాబాద్ : మగధీర, ఈగ లాంటి చిత్రాలతో టాలీవుడ్ నెం.1 దర్శకుడుగా నిలవడంతో పాటు ఆలిండియా దర్శక ప్రముఖుల లిస్టులో చేరిపోయారు ఎస్ఎస్ రాజమౌళి. మరి అలాంటి దర్శకుడు సినిమా గొప్పగా తీసారని పొగిడితే.....ఆ సినిమాకు ఎంత పేరొస్తుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
'ఈగ' చిత్రంలో విలన్‌గా నటించిన సుదీప్ హీరోగా తాజాగా కన్నడలో 'బచ్చన్' అనే సినిమా రూపొందింది. ఇటీవల ప్రసాద్ లాబ్స్‌లో ఆ సినిమాను వీక్షించిన రాజమౌళి సినిమా ఎంతో బాగుందని, గొప్పగా తీసారని, సుదీప్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని, జగపతి బాబు కూడా ఈ చిత్రంలో అతిథి పాత్ర చేసారు. డైరెక్టర్ శంకర్, మొత్తం సినిమా టీంకి కంగ్రాట్స్ అని ట్విట్టర్ ద్వారా తన మనసులోని మాట బయట పెట్టారు.
'బచ్చన్' దర్శకుడు శంకర్ ఈ విషయమై స్పందిస్తూ...తనకు ట్విట్టర్లో అకౌంట్ లేదని, రాజమౌళి ఈ సినిమా గురించి ప్రశంసించిన విషయం ఇంకా నా వరకు రాలేదన్నారు. రాజమౌళి లాంటి గ్రేట్ డైరెక్టర్ నుంచి ప్రశంసలు రావడం ఎంతో సంతోషంగా ఉందని శంకర్ చెప్పుకొచ్చారు.

బచ్చన్ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు.

ఈ చిత్రంలో భావన, పరూల్ యాదవ్, తులిప్ జోషి హీరోయిన్లుగా నటించారు.

తెలుగులో కూడా ఈచిత్రాన్ని అనువదించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

బచ్చన్ చిత్రం కన్నడ బాక్సాఫీసు వద్ద తొలి వారం రూ. 8 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇప్పటి వరకు మొత్తం రూ. 15 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

సుదీప్


Click it and Unblock the Notifications











