అది తెలిస్తే బాహుబలి తీసేవాన్ని కాదు, ఇప్పుడు గర్వంగా ఉంది: రాజమౌళి

మన తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంటే గర్వంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది వరకు భారత్‌ సినిమా అంటే షారుక్‌ ఖాన్‌ లాంటి ఒకరిద్దరు నటులు మాత్రమే గుర్తొచ్చేవారు. కానీ ఇపుడు ‘బాహుబలి’

By Bojja Kumar

హైదరాబాద్: మన తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంటే గర్వంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది వరకు భారత్‌ సినిమా అంటే షారుక్‌ ఖాన్‌ లాంటి ఒకరిద్దరు నటులు మాత్రమే గుర్తొచ్చేవారు. కానీ ఇపుడు 'బాహుబలి' గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అని రాజమౌళి అన్నారు.

సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంటూ వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు రాజమౌళి. బాహుబ‌లి సినిమాకి ఐదేళ్ల స‌మ‌యం పడుతుంది అంటే అసలు చేసేవాడిని కాదని, మొదలు పెట్టేసిన తరువాత సినిమాని మధ్యలో ఆపలేము కదా? అని రాజమౌళి వ్యాఖ్యానించారు.

ఆ సినిమానే స్పూర్తి

ఆ సినిమానే స్పూర్తి

‘మాయాబజార్‌' సినిమా నన్ను బాగా ఆకట్టుకుంది. అందులో ఫాంటసీ నన్ను బాగా ఆకర్షించింది. ఆ సినిమా గురించి ఎప్పుడూ మాట్లాడుకునే వాన్ని, అప్పట్లో ఇలాంటి అద్భుతం ఎలా తీసారని ఆశ్చర్యపోయాను. బాహుబలి తీయడంలో మాయాబజార్ స్ఫూర్తిగా నిలిచింది అని రాజమౌళి తెలిపారు.

దీన్ని సీక్వెల్ గా భావించొద్దు

దీన్ని సీక్వెల్ గా భావించొద్దు

బాహుబలి-2 అనేది బాహుబ‌లి-1 సీక్వెల్ కాదని, ఒక కథను ఒకే సినిమాలో చూపించ‌లేక‌ రెండు భాగాలుగా చూపించామని రాజమౌళి తెలిపారు. తొలి భాగం కన్నా రెండో భాగం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలిపారు.

కట్టప్ప ఇష్యూ ఇ:త పాపులర్ అవుతుందనుకోలేదు

కట్టప్ప ఇష్యూ ఇ:త పాపులర్ అవుతుందనుకోలేదు

బాహుబలిని క‌ట్ట‌ప్ప చంప‌డం అనే సీను ఇంత‌గా పాపులర్ అవుతుంద‌ని తాము ఊహించ‌లేద‌ని, సినిమాకు పబ్లిసిటీ పరంగా, రెండో భాగంపై అంచనాలు పెంచే విధంగా ఇది ఎంతో దోహదపడిందని రాజమౌళి తెలిపారు.

సాధ్యం కాలేదు

సాధ్యం కాలేదు

బాహుబ‌లి-1 త‌రువాత బాహుబ‌లి 2 కోసం ఇంత గ్యాప్ వస్తుందని తాము కూడా అనుకోలేదని రాజ‌మౌళి అన్నారు. బాహుబ‌లి-1 విడుద‌లైన నాలుగు నెలల్లో పార్ట్ 2ని కూడా విడుదల చేయాలనుకున్నామ‌ని, కానీ అది సాధ్యం కాలేద‌ని రాజమౌళి అన్నారు.

విజయానికి కారణం ఆయనే

విజయానికి కారణం ఆయనే

‘తొలి విభాగం విజయం వెనుక కారణం ఒక్కటే.. క్యారెక్టరైజేషన్‌. మా నాన్నగారు గొప్ప పాత్రలను తీర్చిదిద్దారు. మామూలుగా ఒక సినిమాను చూస్తున్నప్పుడు దాన్ని ఆస్వాదిస్తే.. అది మంచి సినిమా అవుతుంది. కానీ ‘బాహుబలి' సినిమాను చూసి బయటకు వచ్చాక కూడా అందులోని పాత్రలు ప్రేక్షకుడికి గుర్తొస్తున్నాయి. అందుకే ఈ సినిమా అంతగా విజయం సాధించింది.

తర్వాతి సినిమా

తర్వాతి సినిమా

తర్వాతి సినిమా గురించి ఇంకా ఆలోచించలేదు. హాలిడేస్‌ నుంచి తిరిగి వచ్చాక దాని గురించి నిర్ణయం తీసుకుంటా. హాలిడేకు బూటాన్‌కు వెళ్తున్నామని రాజమౌళి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X