రాజమౌళి, పూరీ జగన్నాథ్ లలో ఎవరు గొప్ప?
తెలుగు సినిమా గత చరిత్ర ను తిరగరాసిన రెండు సినిమాలను అధ్భుతంగా తెరకెక్కించిన దర్శకులు పూరీ జగన్నాథ్, రాజమౌళి. ఈ ఇద్దరు దర్శకులు వారి ఇమేజ్ లతో పనిలేకుండా మంచి స్నేహ బావంతో ఉంటారు. అయితే ఈ దర్శకులలో ఎవరు గొప్ప అనే టాపిక్ హాట్ టాపిక్ అయ్యింది. ఫిల్మ్ నగర్ వాసులు చేసిన ఈ సర్వే కథనం ప్రకారం రాజమౌళి, పూరీ జగన్నాథ్ లది ఇద్దరి మనస్తత్వం డిఫరెంట్ శైలి.
రాజమౌళి తన చిత్రాలను ఫ్యామిలి సహకారం లేనిదే తీయలేదు. తన చిత్రానికి డైరెక్షన్ కు సంబంధించిన వర్క్ తప్ప మరోటి చేయడు. అదే పూరీ జగన్నాథ్, అయితే కథ, మాటలు, స్క్రీన్ ప్లే వంటి ఇతర విభాగాలతో కలుపుకుని మరీ దర్శకత్వం చేస్తుంటాడు. అందుకే మిస్టర్ డిఫండెబుల్ గా పేరొందిన పూరీ జగన్నాథ్ నే వారు గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే జనం రాజమౌళిని కూడా గొప్పగా వేరే కోణంలో చెప్పుకుంటున్నారు. రాజమౌళికి ఉన్న సక్సెస్ శాతం పూరీ జగన్నాథ్ కి లేదు. కాబట్టి ఆ కోణంలో రాజమౌళి కూడా గొప్పే అన్నది వారి వాదన. మొత్తంగా ఇద్దరు ఇద్దరే అనుకోవాలే గానీ పోలిక అవసరం లేదనేది ఎక్కువ మంది వాదిస్తున్నారు.


Click it and Unblock the Notifications











