RRR : జక్కన్న సూచనలు.. మహేష్ బాబు థియేటర్లో తారక్ ఫ్యామిలీ.. రాజమౌళి సెంటిమెంట్ థియేటర్లో ఉపాసన రచ్చ
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం RRR. ఈ చిత్రం కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. అలా ఎట్టకేలకు విడుదలైన ఈ సినిమా అద్భుతమైన స్పందన తెచ్చుకుంటోంది. అయితే ఈ సినిమాను ఎన్టీఆర్, రామ్ చరణ్ సతీమణులు కూడా చూశారు. ఆ వివరాలు

తూచా తప్పకుండా
ఇప్పుడు ఎక్కడ చూసినా..ఎక్కడ విన్నా RRR అనే మాటే వినిపిస్తోంది. ఆ సినిమా చూడని వాళ్ళని వింత మనుషులని చూసినట్టు చూస్తున్నారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇక ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అర్ద్రరాత్రి నుంచే సినిమా ధియేటర్ల వద్ద పండుగ సందడి మోడీలు పెట్టేశారు. ప్రేక్షకులతోనే మీరూ సినిమా చూడాలని జక్కన్న కోరడంతో దాన్ని ఎన్టీఆర్, చరణ్ తూచా తప్పకుండా పాటించారు.

నెట్టింట వైరల్
ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎస్ ఎస్ రాజమౌళి కూడా అభిమానులతో కలిసి థియేటర్లలో సినిమాలు చూశారు. జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ మాల్ లో తన ఫ్యామిలీతో కలిసి సినిమాను చూశారు. ఫ్యాన్స్ తో కలిసి, కుటుంబ సమేతంగా ఆర్ఆర్ఆర్ చూడటం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

థియేటర్ లోపలికి తీసుకెళ్లి
ఇక వీరు కాకుండా ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్ తమ తమ కుటుంబాలతో కలిసి భ్రమరాంబ థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూశారు. అయితే ఈ థియేటర్ వద్ద రాజమౌళి, చరణ్ ఫ్యాన్స్ నుంచి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు నుంచి థియేటర్ హాల్ కు చేరుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. థియేటర్ వద్ద రామ్ చరణ్ కనిపించడంతో చెర్రీ ఫ్యాన్స్ ఒకేసారి ఆయన వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ సెక్యూరిటీ వారిని అడ్డుకుని థియేటర్ లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టారు.

ఫ్యాన్స్‌పైన పేపర్లు చల్లి
ఇక ఈ క్రమంలో రామ్ చరణ్ షూ కూడా ఊడిపోయిందని అంటున్నారు. రాం చరణ్ కస్టమైజ్డ్ టోపీతో క్యాజువల్ లుక్‌లో కనిపించగా ఆయన చెర్రీ సతీమణి ఉపాసన మాత్రం తన సహజ శైలికి భిన్నంగా థియేటర్ లో రచ్చ చేశారు. మాములుగా ఆమె చాలా రిజర్వ్డ్ గా ఉంటుంది. కానీ ఈ సినిమా జరుగుతున్నంత సేపు కాగితాలు ఎగురవేస్తూ రచ్చ చేశారు. నాటు నాటు సాంగ్ రాగానే ఫ్యాన్స్‌పైన పేపర్లు చల్లింది ఆమె. ఆ పేపర్లు గాల్లోకి ఎగరేస్తూ సంతోషం వ్యక్తం చేసింది.

ఈలలు వేస్తూ
ఇక సాధారణ యువతిలా తెరపై తన భర్త నటనను చూసి కేకలు, ఈలలు వేస్తూ ఎంజాయ్ చేసారు. ఇప్పుడు ఉపాసన థియేటర్ లో ఒక ఫ్యాన్ గా చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వీడియోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక చరణ్ కూడా తన ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసినందుకు సంతోషం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











