బాహుబలి: టికెట్స్ రేట్లు పెంచడంపై రాజమౌళి స్పందించారు

By Bojja Kumar

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాతలు టికెట్స్ రేట్లు పెంచాలనే ఆలోచనలో ఉన్నారని, తాము పెట్టిన భారీ పెట్టుబడి తిరిగి రాబట్టుకోవడానికి ఈ విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులను కలిసినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

మల్టీప్లెక్స్ టికెట్స్ రేటు ప్రస్తుతం రూ. 150 వరకు ఉంది. వీటి ధర వీకెండ్ లో రూ. 200 నుండి 250 వరకు చేయాలని ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అదే విధంగా మామలూ థియేటర్లలో కూడా పెంచాలనే ప్లాన్స్ వేసారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన ‘బాహుబలి' మూవీ ప్రెస్ మీట్లో రాజమౌళి స్పందించారు.

 Rajamouli refuted the rumours about price hike

‘టికెట్స్ రేట్లు పెంచడానికి తామె ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. అయినా అలాంటివి మేము ఎలా చేయగలం అంటూ ప్రశ్నించారు. ఇవన్నీకేవల ఆదారంలేని రూమర్స్ మాత్రమే అని రాజమౌళి స్పష్టం చేసారు. ఇలాంటి వార్లు విన్నపుడు ఒకప్పుడు కోపం వచ్చేది. కానీ మాకు ఇలాంటి వినడం అలవాటు అయిపోయింది. బాగా నవ్వుకుంటున్నాం' అని రాజమౌళి తెలిపారు.

'ఆడియో వేడుకకు కొంత మందిని మాత్రమే అనుమతి ఇస్తామని అంటున్నారు. కొందరిని మాత్రమే అనుమతించి ఫ్యాన్స్ ని నిరుత్సాహపరచడం ఇష్టం లేదు. అందుకే వల్ల ఆడియో వేడుకను వాయిదా వేయాల్సి వచ్చింది. ఫ్యాన్స్ కి క్షమాపణలు. తదుపరి ఆడియో వేడుక తేదీని ఇంకా అనుకోలేదు'' అని రాజమౌళి అన్నాడు. ప్రభాస్ మాట్లాడుతూ...''ఫ్యాన్స్ అందర్నీ కలిసి రెండేళ్లయ్యింది. సెక్యుర్టీ రీజన్స్ వల్ల బాహుబలి వేడుక చేయలేకపోతున్నాం. తదుపరి తేదీని ప్రకటిస్తాం. అభిమానులందరికీ క్షమాపణలు'' అని ప్రభాస్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X