'మగధీర'ను గుర్తు చేసుకుంటూ రాజమౌళి ట్వీట్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజా ట్వీట్ లో మగధీరను గుర్తు చేసుకున్నారు. ఆ ట్వీట్ లో...మగధీర... ఇప్పటికి మూడేళ్లు అయిపోయాయి. క్రితం సంవత్సరంమే సినిమా చేసినట్లుంది. మేము విసిగిపోయినప్పటికీ... ఉత్సాహంగానే ఆ ప్రాజెక్టు చేసాం... జీవితంలో ఒక సారే వచ్చే సినిమా ఇది అన్నారు. 2009లో విడుదలైన తెలుగు సినిమా మగధీర. దీనిని అల్లు అరవింద్, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ హీరోగా నిర్మించారు. ఇక ఇది ఒక యాక్షన్ బేసెడ్ లవ్ స్టోరీ.
కథ ప్రకారం నాలుగు సంవత్సరాల క్రిందట గత జన్మలొ ప్రేమలో ఓడిపోయిన కాల భైరవ అనే సైనిక శిక్షకుడు (రామ్ చరణ్ తేజ్) మరియు యువరాణి మిత్ర విందా దేవి (కాజల్) మరలా తమ ప్రేమను గెలిపించుకోవడనికి మళ్ళీ పుడతారు. నాలుగు శథాబ్ధాల క్రితం ఏమి జరిగింది...మరు జన్మలో వారు ఎలా కలుసుకొన్నారు..వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి..అనేది చిత్ర కథ.
ఈ చిత్రంలో రామ్ చరణ్ చేసే గుర్రపు స్వారీ, వంద మంది యోధులను సంహరించే సన్నివేశం,ఉదయ్ ఘడ్ లోని దృశ్యం హైలెట్ గా ఉంటుంది. అలాగే షేర్ ఖాన్ గా శ్రీహరి నటన సినిమాకు ప్రాణమై నిలిచింది. అవార్డుల విషయానికి వస్తే..ఉత్తమ నృత్య దర్శకుడిగా కె.శివశంకర్ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అందించినందుకు గాను కనల్ కణ్ణన్ లకు జాతీయ చలన చిత్ర పురస్కారాలు అందుకున్నారు.
ఇక ఈ చిత్రానికి కథ - వి.విజయేంద్ర ప్రసాద్, మాటలు - ఎం.రత్నం, పాటలు - భువన చంద్ర, చంద్రబోస్, ఎమ్.ఎమ్.కీరవాణి. దుస్తులు- రమా రాజమౌళి, ఫైట్స్ - పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్, ఆర్ట్ డైరెక్టర్ ఎస్.రవీందర్, ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు, కెమేరా - కె.కె.సెంతిల్ కుమార్, సంగీతం - ఎమ్.ఎమ్.కీరవాణి, నిర్మాత - అల్లు అరవింద్, స్క్రీన్ ప్లే,దర్శకత్వం - ఎస్.ఎస్.రాజమౌళి.


Click it and Unblock the Notifications











