»   » రాంచరణ్ ఆకాశానికెత్తుతూ రాజమౌళి ప్రశంసల వర్షం.. జగపతి బాబు ఒక్కడే, భయంకరంగా!

రాంచరణ్ ఆకాశానికెత్తుతూ రాజమౌళి ప్రశంసల వర్షం.. జగపతి బాబు ఒక్కడే, భయంకరంగా!

Subscribe to Filmibeat Telugu
Rajamouli Reaction After Watching Rangasthalam Movie

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బిజీగా గడిపిన రాజమౌళి ఎట్టకేలకు రంగస్థలం చిత్రంపై స్పందించాడు. రాంచరణ్ అద్భుత నటన, సుకుమార్ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. రాంచరణ్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్న సంగతి తెలిసిందే. 1980 నాటి పరిస్థితులకు అనుగుణంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. పల్లెటూరి రాజకీయ నేపథ్యంలోసాగిన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖులు చిత్ర విజయానికి అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసినదే. దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా రంగస్థలం చిత్రం పై స్పందించారు.

దూసుకుపోతున్న రంగస్థలం

దూసుకుపోతున్న రంగస్థలం

వారం గడచినా రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. రంగస్థలం చిత్రం టాలీవడ్ అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రాల్లో బాహుబలి తరువాత రెండవ స్థానంలో నిలిచింది.

ఆ రెండు అంశాలే

ఆ రెండు అంశాలే

రాంచరణ్ తన నటనతో ఆడియన్స్ ని మంత్ర ముగ్దుల్ని చేసాడు. సుకుమార్ తన దర్శకత్వంతో అదరగొట్టాడు. ఈ రెండు అంశాలే సినిమాని మరో స్థాయికి చేర్చాయి.

రాజమౌళి స్పందన

రాజమౌళి స్పందన

రంగస్థలం చిత్రంలో ప్రస్తావించుకోవాల్సిన మంచి అంశాలు చాలా ఉన్నాయని రాజమౌళి అన్నారు. కానీ ముఖ్యంగా కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలని రాజమౌళి అన్నారు. సుకుమార్ పాత్రలని తీర్చిదిద్దిన విధానం అద్భుతం అని రాజమౌళి అన్నారు. ముఖ్యంగా చిట్టిబాబు పాత్రని సుకుమార్ మలచిన విధానం, చిట్టిబాబుగా రాంచరణ్ నటన వర్ణనాతీతంగా ఉన్నాయని రాజమౌళి అభిప్రాయపడ్డారు.

 జగపతి బాబు ఒక్కరే

జగపతి బాబు ఒక్కరే

ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్రకు ధీటుగా నిలబడింది జగపతి బాబే అని రాజమౌళి అన్నారు. విలన్ పాత్రలో ఆయన భయంకర నటన అద్భుతం అని అన్నారు. జగపతి బాబు డైలాగ్ డెలివరీ విధానం ఆకట్టుకుందని తెలిపారు.

 రాజమౌళి శుభాకాంక్షలు

రాజమౌళి శుభాకాంక్షలు

ఈ సందర్భంగా రాజమౌళి మైత్రి మూవీ మేకర్స్ కి, మరియు రంగస్థలం చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేసారు.

English summary
Rajamouli response on Rangasthalam movie. Rajamouli praises Sukumar, RamCharan and Jagapathi Babu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X