చిట్టిబాబు గురించి రాజమౌళి రెస్పాన్స్..ట్రైలర్ తో మరింత చేరువగా!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం రంగస్థలం చిత్రం గురించే చర్చ జరుగుతోంది. దివారం ఉగాదిరోజున ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో రంగస్థలం చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో లోకల్ గా సాగె రాజకీయాలతో కట్టి పడేసే విధంగా సుకుమార్ తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.

కాగా రంగస్థలం చిత్రం ట్రైలర్ పై దర్శకధీరుడు రాజమౌళి తాజగా సోషల్ మీడియాలో స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ట్రైలర్ ద్వారా తనకు రాంచరణ్ మరింత చేరువ అయ్యాడని తెలిపారు. రాంచరణ్ పాత్రపై ఆసక్తి పెంచే విధంగా ట్రైలర్ ఉందని సుకుమార్ తెలపడం విశేషం. విలన్ పాత్రలో జగపతి బాబు ఒదిగిపోయినట్లు ఉన్నారని రాజమౌళి తెలిపాడు. చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రాజమౌళి ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











