‘RRR’ హీరోయిన్లు, ముఖ్యతారాగణం వీరే.. రాజమౌళి అఫీషియల్ ప్రకటన!
Recommended Video

'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్న సందేహాలు తొలగించడానికి దర్శకుడు రాజమౌళితో పాటు చిత్ర బృందం గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ కాన్సెప్టుతో పాటు చిత్రంలో నటించే ముఖ్యతారాగణం వివరాలు ప్రకటించారు.
ఈ చిత్రం 1920 బ్రిటిష్ కాలం నాటి కథతో సాగుతుందని రాజమౌళి తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కొమురంభీం స్టోరీలను స్పూర్తిగా తీసుకుని ఫిక్షనల్ స్టోరీతో ఈ చిత్రం సాగుతుందని స్పష్టం చేశారు. ఉత్తర భారతదేశంలో కథలో యంగ్ అల్లూరిగా రామ్ చరణ్, యంగ్ కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపిస్తారని తెలిపారు.

ముఖ్య పాత్రలో అజయ్ దేవగన్
‘ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నాం. ఇలాంటి స్టోరీకి, ఇంత పెద్ద హీరోలు ఉన్న స్టోరీకి చాలా బలమైన సపోర్టింగ్ కూడా అవసరం. అజయ్ దేవగన్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర చేయడానికి అంగీకరించారు. వెంటనే డేట్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో భాగం కావడంపై ఆసక్తిగా ఉన్నారు. ఆయన పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని రాజమౌళి తెలిపారు.

రామ్ చరణ్ సరసన అలియా భట్
చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. అనుకోకుండా బాంబే నుంచి వస్తుంటే ఎయిర్ పోర్టులో కలిశాం. ఆ సమయంలో స్టోరీ చెబితే వెంటనే చేయడానికి ఓకే చెప్పింది. ఈ ప్రాజెక్టుపై ఆమె చాలా ఎగ్జైట్మెంటుతో ఉందని రాజమౌళి స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ సరసన విదేశీ బ్యూటీ
డైసీ ఎడ్గర్ జోన్స్ అనే యంగ్ లేడీ తారక్ సరసన నటిస్తోందని రాజమౌళి వెల్లడించారు. ఈవిడ ఇంగ్లండ్‌కు చెందిన నటి.
సముద్రఖని
సముద్రఖని మరో ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఆయన ఈ చిత్ర కథకు బ్యాక్ బోన్‌లా ఉంటారని తెలిపారు.

మెయిన్ టైటిల్ ‘ఆర్ఆర్ఆర్’
‘ఆర్ఆర్ఆర్' అనేది వర్కింగ్ టైటిల్. కానీ ఫ్యాన్స్, డిస్ట్రిబ్యూటర్స్ వద్ద నుంచి అదే టైటిల్ పెట్టాలని ప్రెషర్ వచ్చింది. ఈ టైటిల్ అన్ని భాషలకు యూనివర్శల్ గా ఉంటుంది కాబట్టి దాన్నే మెయిన్ టైటిల్ గా పెట్టి ఆయా భాషల్లో ఒక్కో రకమైన ఎక్స్‌పాన్షన్‌తో సబ్ టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు రాజమౌళి తెలిపారు.


Click it and Unblock the Notifications











