twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘RRR’ స్టోరీ చెప్పిన రాజమౌళి: అల్లూరిగా చరణ్, కొమురం భీంగా తారక్

    |

    Recommended Video

    #RRRPressMeet : SS Rajamouli About RRR Movie Story | Ram Charan | Jr NTR | Filmibeat Telugu

    'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్న సందేహాలు తొలగించడానికి దర్శకుడు రాజమౌళితో పాటు చిత్ర బృందం గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ కాన్సెప్టుతో పాటు చిత్రంలో నటించే ముఖ్యతారాగణం వివరాలు ప్రకటించారు.

    ఈ చిత్రం 1920 బ్రిటిష్ కాలం నాటి కథతో సాగుతుందని రాజమౌళి తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కొమురంభీం జీవితాన్ని స్పూర్తిగా తీసుకున్నామని, ఉత్తర భారతదేశంలో కథతో ఇద్దరు రియల్ హీరోల చుట్టూ... ఫిక్షనల్ కథతో ఈ చిత్రం ఉంటుందన్నారు.

    అల్లూరి సీతా రామరాజు, కొమురం భీం

    రాజమౌళి మాట్లాడుతూ.... 1897లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. ఆయన ఇంగ్లీష్ చదువులే కాకుండా ఇతిహాసాలు బాగా చదువుకున్నారు. యుక్తవయసులో ఉండగా ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఒక రెండు మూడు సంవత్సరాల పాటు ఆయన లేరు. ఎక్కడికి వెళ్లారో? ఏం చేశారో తెలియదు. తిరిగి వచ్చిన తర్వాత స్వతంత్ర ఉద్యమం మొదలు పెట్టారు. అల్లూరి సీతా రామరాజు పుట్టిన రెండు మూడు సంవత్సరాల గ్యాపులోనే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కొమురం భీం పుట్టారు. ఆయన కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయారు. వెళ్లిన తర్వాత ఏం జరిగింది? అనే కథ కూడా ఎవరికీ తెలియదు. వెళ్లేపుడు నిరక్ష్యరాస్యుడు.. తిరిగి వచ్చేప్పుడు చదువుకున్న వ్యక్తిగా తిరిగి వచ్చారు. తర్వాత నిజాం ప్రభుత్వంపై పోరాటం చేశారు.

    ఈ ఇద్దరి స్టోరీ ఆసక్తికరం

    ఈ ఇద్దరి స్టోరీ ఆసక్తికరం

    అల్లూరి సీతా రామరాజు, కొమురం భీం ఈ ఇద్దరి చరిత్ర చదువుతున్నపుడు ఒకే సమయంలో పుట్టడం, ఒకే సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోవడం... వెళ్లిన తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియక పోవడం.. తిరిగి వచ్చిన తర్వాత ఒకే విధంగా ఫైట్ చేయడం నాకు ఆసక్తికరంగా అనిపించిందని రాజమౌళి తెలిపారు.

    ఫిక్షనల్ కథ... అల్లూరిగా రామ్ చరణ్, కొమురం భీంగా తారక్

    ఫిక్షనల్ కథ... అల్లూరిగా రామ్ చరణ్, కొమురం భీంగా తారక్

    స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే ఇద్దరు మహా వీరులు. చరిత్రలో ఎప్పుడూ కలవని వారు, మనకు తెలియని సమయంలో వారిద్దరూ కలిసి ఉంటే ఒకరికొకరు ఇన్‌స్పిరేషన్ అయి ఉంటే... ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడితే ఎలా ఉంటుంది? లాంటి అంశాలతో ‘ఆర్ఆర్ఆర్' చిత్రం తెరకెక్కుతోంది. ఇద్దరు రియల్ హీరోల చరిత్రను బేస్ చేసుకుని రాసుకున్న పూర్తి ఫిక్షనల్ స్టోరీ ఇది. ఎవరికీ కనిపించకుండా పోయిన సమయంలో యంగ్ అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, యంగ్ కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపిస్తారని రాజమౌళి తెలిపారు.

    భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నాం

    భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నాం

    ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్నాం. ఇలాంటి సినిమాను చిన్నగా తీయడం నాకు నచ్చదు. 1920 ప్రాంతంలో జరిగిన కథ కాబట్టి దాని మీద చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో జీవన విధానం ఎలా ఉండేది? కాస్టూమ్స్ ఎలా ఉండేవి? మాట్లాడే విధానం ఎలా ఉండేది? వర్తకం ఎలా ఉండేది? ఇలా చాలా రీసెర్చ్ చేశాం. అందుకే సినిమా మొదలు పెట్టడానికి చాలా రోజులు పట్టిందని రాజమౌళి తెలిపారు.

    English summary
    Rajamouli revealed RRR story and main cast and crew. Director SS Rajamouli is holding a press meet on March 14 to announce the title, release date and the details of cast and crew of his movie RRR starring Jr NTR and Ram Charan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X